Dinesh Karthik : “నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ. అతడు సూపర్ బ్యాటర్. ఫార్మాట్లతో అతడికి సంబంధం లేదు. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సూపర్ బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవలి మ్యాచ్ లను పరిశీలిస్తే జోరూట్ స్థిరంగా ఆడుతున్నాడు. కానీ విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాల నుంచి పరుగుల మీద పరుగులు చేస్తున్నాడు. ఇప్పటి గణాంకాల ప్రకారం జో రూట్ ను గొప్ప ఆటగాడు అని అందరూ అంటున్నారు. కాకపోతే విరాట్ కోహ్లీని నేను అత్యంత దగ్గరగా చూశాను. కాబట్టి రూట్ ఆ దృష్టిలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ కాలేడు. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలో విరాట్ పరుగుల సునామి సృష్టిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో అతడు ఉతికి ఆరేస్తున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ ఇన్నింగ్స్ అందుకు ఒక ఉదాహరణ అని” దినేష్ వ్యాఖ్యానించాడు. “విరాట్ ముందు రూట్ సరిపోడు. అనుమానమే లేదు..రూట్ కంటే విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని” దినేష్ కార్తీక్ వివరించాడు.
ఇక టీమ్ ఇండియాకు సంబంధించి భవిష్యత్తు కెప్టెన్లుగా పంత్, గిల్ కు అవకాశం ఉందని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.. టి20 ఫార్మాట్ నుంచి తప్పకుండా రోహిత్ శర్మ.. వచ్చేయడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ బెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ ఆడిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత విరామం ప్రకటిస్తాడని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. ” భవిష్యత్తు కాలంలో పంత్, గిల్ భారత జట్టును నడిపిస్తారు. టీమిండియాలో మూడు ఫార్మాట్లలో నడిపించే సామర్థ్యం వీరి సొంతం. వీరిద్దరూ ఐపీఎల్లో తమ జట్లకు నాయకత్వం వహిస్తున్నారని” దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జో రూట్ 34 టెస్టు సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 29 శతకాలు బాదాడు. టెస్టులలో 51 సెంచరీలు చేశాడు. 15,921 రన్స్ చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ నెలకొల్పిన ఈ ఘనతను రూట్ బ్రేక్ చేయాలంటే మరో పద్దెనిమిది సెంచరీలు చేయాలి..3,544 రన్స్ చేయాలి. ప్రస్తుతం రూ వయసు 33 సంవత్సరాలు. ఇదే తీరుగా అతడు ఫామ్ కొనసాగిస్తే సచిన్ రికార్డు అధిగమించే అవకాశం ఉంది. అయితే గతంలో జట్టులో స్థానం కోల్పోయిన రూట్.. ఇదే ఫామ్ కొనసాగిస్తాడా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అతడు స్వదేశంలో శ్రీలంకపై వరుసగా రెండు సెంచరీలు చేశాడు. అదే జోరు విదేశీ మైదానాలపై సాగించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.