Homeక్రీడలుIPL 2023 - Surya Kumar Yadav : ఐపీఎల్‌లో సూర్య ప్రతాపం.. ముంబై క్రికెటర్‌కు...

IPL 2023 – Surya Kumar Yadav : ఐపీఎల్‌లో సూర్య ప్రతాపం.. ముంబై క్రికెటర్‌కు ఇదే బెస్ట్‌ సీజన్‌! 

IPL 2023 – Surya Kumar Yadav : పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించిన టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌ పదహారో సీజన్‌ బాగా కలిసొచ్చింది. లీగ్‌ దశలో ఫస్ట్‌ ఆఫ్‌లో విఫలైమన సూర్య… సెకండాఫ్‌లో చెలరేగాడు. తనదైన స్కూప్‌ షాట్స్, బ్యాటింగ్‌ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ విధ్వంసక బ్యాటర్‌ ఈ సీజన్ లో అత్యద్భుతంగా రాణించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న అతను ఐపీఎల్‌లో తొలి సెంచరీ బాదాడు. అది కూడా పటిష్టమైన గుజరాత్‌ టైటాన్స్‌పై. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

సూర్యకు ఇదే అత్యుత్తమ సీజన్‌

క్వాలిఫైయర్‌ 2 పోరులోనూ డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై సూర్యకుమార్‌ అర్ధ శతకంతో మెరిశాడు. కానీ, మోహిత్‌ శర్మ ఓవర్లో స్కూప్‌ షాట్‌ ఆడబోయి బౌల్డయ్యాడు. ఈ విధ్వంసక బ్యాటర్‌ ఈ సీజన్‌లో అత్యద్భుతంగా రాణించాడు. 15 మ్యాచుల్లో 605 రన్స్ కొట్టాడు. దాంతో, ముంబై ఇండియన్స్‌ తరఫున ఒక సీజన్‌లో 600పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. మాజీ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌.. సూర్య కంటే ముందున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ 2010లో 618 రన్స్  బాదాడు. 181.14 స్ట్రైక్‌ రేటుతో ఆడిన సూర్యకుమార్‌ ఈ సీజన్‌లో అత్యధికంగా 5 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాధించాడు.
ఐపీఎల్‌కు ముందు పేలవ ప్రదర్శన.. 

ఐపీఎల్‌కు ముందు సూర్య పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు అన్నట్లుగా అతని ఆటతీరు సాగింది. 360 డిగ్రీ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న గుర్తింపు కూడా వట్టిదే అన్నట్లు ఫామ్‌ కోల్పోయాడు. ఐపీఎల్‌ ఫస్ట్‌ ఆఫ్‌లో కూడా పేలవ ప్రదర్శనతో విమర్శలు వచ్చాయి. అయినా ముంబై టీం యాజమాన్యం సూర్యపై నమ్మకంతో ప్రతీ మ్యాచ్‌ ఆడించింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని సూర్య నిలబెట్టుకున్నాడు. సెకండ్‌ ఆఫ్‌లో ఫామ్‌లోకి వచ్చి.. సత్తా చాటాడు. పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగు లేదని నిరూపించాడు.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular