IML 2025
IML 2025 : ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య జరిగింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ఇండియా మాస్టర్స్ ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టును దారుణంగా ఓడించి ఫైనల్ బెర్త్ కన్ఫాం చేసుకుంది. మార్చి 13న రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ ఆటగాళ్ళు 20 ఓవర్లలో 221 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించారు. ఈ స్కోరును ఛేదించడానికి ఆస్ట్రేలియా మాస్టర్స్ బరిలోకి దిగింది.. కానీ 126 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విధంగా ఇండియా మాస్టర్స్ 94 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు సచిన్ జట్టు మార్చి 16న టైటిల్ మ్యాచ్ కోసం ఈ స్టేడియంలోనే ఆడనుంది.
Also Read : షోయబ్ అక్తర్ బౌలింగ్లో పక్కటెముకలు విరిగిపోయాయి.. అంతటి బాధనూ సచిన్ బయటకు చెప్పలేదు: వీడియో వైరల్
What a for #IndiaMasters!
A commanding 9️⃣4️⃣-run victory over #AustraliaMasters and they’re now eyeing the ultimate prize – !⚡#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex️ pic.twitter.com/5oszbeALFO
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 13, 2025
కీలకమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించడంలో చాలా మంది క్రికెటర్లు తమ ప్రతిభను చాటారు. కానీ షాబాజ్ నదీమ్ మ్యాచ్ విన్నింగ్ లో కీలక పాత్ర పోషించాడు. ప్రాణాంతక బౌలింగుతో ఆస్ట్రేలియా జట్టు వెన్ను విరిచాడు. వినయ్ కుమార్ తొలి రెండు దెబ్బల తర్వాత, నదీమ్ కంగారూ జట్టు మిడిల్ ఆర్డర్‌ను నాశనం చేశాడు. అతను కేవలం 3.8 ఎకానమీతో 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గానూ అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా సెలక్ట్ అయ్యాడు. అతనితో పాటు వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. స్టూవర్ట్ బిన్నీ, పవన్ నేగి ఒక్కొక్కరు ఒక్కో వికెట్ పడగొట్టారు.
' – 5️⃣0️⃣!
His powerful display leads him to a remarkable half-century! ⚡
Watch the action LIVE ➡ on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! #IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/QhJRdyh4zu
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 13, 2025
బౌలింగ్ చేయడానికి ముందు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇండియా మాస్టర్స్ తరపున బ్యాట్‌తో మాయాజాలం చేశారు. అందరూ చాలా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ఆస్ట్రేలియా మాస్టర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీని తరువాత సచిన్, అంబటి రాయుడుతో కలిసి ఇండియా మాస్టర్స్ కోసం ఓపెనింగ్ చేయడానికి వచ్చాడు. రెండో ఓవర్లోనే రాయుడు ఔటయ్యాడు. దీని తరువాత, సచిన్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. కేవలం 30 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు.
సచిన్ ఔట్ అయిన తర్వాత, యువరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతను ఆస్ట్రేలియా మాస్టర్స్‌పై 7 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. యువరాజ్ 30 బంతుల్లో 196 స్ట్రైక్ రేట్‌తో 59 పరుగులు చేశాడు. బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా, యూసుఫ్ 10 బంతుల్లో 23 పరుగులు, ఇర్ఫాన్ 7 బంతుల్లో 19 పరుగులు సాధించారు. వీళ్లందరి బ్యాటింగ్ కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరు ఒత్తిడిని తట్టుకోలేకపోయిన ఆస్ట్రేలియా దిగ్గజాలు 18.1 ఓవర్లలో కేవలం 126 పరుగులకే ఆలౌట్ అయ్యాయి.
Also Read : నచ్చిన షాట్ ఆడకుండానే.. సచిన్ ఉగ్రరూపం.. ఇది క్రికెట్ లోనే అత్యంత అరుదైన పునరాగమనం!
– -!
Witness Sachin's magic unfold in the #IMLT20 semi-final!
Watch the action LIVE ➡ on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! #IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/jTEdGqkg8S
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 13, 2025
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Iml 2025 sachin tendulkars team crushes australia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com