IIT Babu Prediction on IND vs PAK match
Ind vs Pak : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఐదవ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు ఈ మ్యాచ్ గురించి అంచనాలు వేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు కూడా భారత్‌ను ఓడించడం కష్టమని చెబుతున్నారు. అయితే, ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా కీలక విషయాలను చెబుతూ వస్తున్నారు.
గత మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించగా, ఆతిథ్య పాకిస్తాన్ సొంత దేశంలో జరిగిన టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజయం సాధించేందుకు 80 శాతం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఐటీ బాబా మ్యాచ్ గురించి అంచనా వేస్తూ భారతదేశం ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందని అన్నారు. భారత్ ఏం చేసినా పాకిస్తాన్ గెలిచి తీరుతుందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐఐటీ బాబా జోస్యం
మ్యాచ్ కు ముందు లైవ్ స్ట్రీమ్ లో ఐఐటీ బాబా మాట్లాడుతూ.. “ఈసారి భారత్ గెలవదు. విరాట్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు.” అని అన్నారు. దీనికి ముందు కూడా క్రికెట్ గురించి ఆయన చేసిన ఒక ప్రకటన వైరల్ అయింది. 2024 టీ20 ప్రపంచ కప్‌ను కూడా టీం ఇండియా గెలిపించింది తానే అని ఆయన అన్నారు. ఐఐటీ బాబా తన మన్ బాత్ లో రోహిత్ శర్మకు బంతిని ఎవరికి ఇవ్వాలో తానే చెప్పానంటూ తెలిపారు.
ఐసిటి బాబా మొదటిసారి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో కనిపించారు. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఐఐటీ ముంబై నుండి చదువుకున్నానని చెప్పాడు. దీని తరువాత, అతను సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాడు. అనేక ఛానెల్స్ ఆయనను ఇంటర్వ్యూ చేశాయి.
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, మహ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టీం ఇండియా ఓ రికార్డును సృష్టించింది. వన్డే క్రికెట్‌లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. ఆ జట్టు వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది.