https://oktelugu.com/

IND vs PAK : రసవత్తరంగా భారత్ పాక్ మ్యాచ్.. ధోనీని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం ఇదే

నేడు ఇండియా.. పాకిస్తాన్ మ్యాచ్‌ను తన సహచరులతో కూర్చొని చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. కానీ అది తన ఇంట్లో కాదు. తన సిబ్బందితో కలిసి ఒక యాడ్ షూట్ సెట్లో ధోని మ్యాచ్ చూస్తన్నాడు. అతనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కూడా లైవ్ మ్యాచ్ చూస్తున్నారు.

Written By: , Updated On : February 23, 2025 / 05:38 PM IST
MS Dhoni Watching IND vs PAK Match

MS Dhoni Watching IND vs PAK Match

Follow us on

IND vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీలో జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మధ్య ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్‌ను ఎంఎస్ ధోని ఆస్వాదిస్తున్నాడు. దీని వీడియోను JioHotstar షేర్ చేసింది. తను చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించి భారత మ్యాచ్ చూస్తున్నాడని అభిమానులు అతనిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. 2013లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీం ఇండియా చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. గతంలో ధోని కెప్టెన్సీలో భారత్ టీ20, వన్డే ప్రపంచ కప్‌లను కూడా గెలుచుకుంది. 2020 లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. తను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 కోసం రెడీ అవుతున్నాడు ధోని. నేడు ఇండియా.. పాకిస్తాన్ మ్యాచ్‌ను తన సహచరులతో కూర్చొని చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. కానీ అది తన ఇంట్లో కాదు. తన సిబ్బందితో కలిసి ఒక యాడ్ షూట్ సెట్లో ధోని మ్యాచ్ చూస్తన్నాడు. అతనితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కూడా లైవ్ మ్యాచ్ చూస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను ఎంఎస్ ధోని పసుపు రంగు జెర్సీ ధరించి వీక్షిస్తున్నారు. అయితే, ఇది CSK మ్యాచ్ జెర్సీ కాదు. అతను మ్యాచ్ చూస్తున్న వీడియోను ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా JioHotstar పోస్ట్ చేసింది. ధోని ఏదో షూటింగ్ కోసం వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది. ఈలోగా అతను అక్కడ ఉన్న సిబ్బందితో మ్యాచ్ చూడడాన్ని హాట్ స్టార్ తెరమీద చూపించింది. అదే సమయంలో ధోని పసుపు జెర్సీలో మ్యాచ్ చూడటం కొంతమంది అభిమానులకు నచ్చలేదు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో ధోనిని ట్రోల్ చేస్తున్నారు. టీం ఇండియా జెర్సీ వేసుకుంటే ఏమవుతుందని చాలా మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారత్ టి 20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. మూడు టైటిళ్లను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ. ప్రస్తుతం ట్రోల్ అవుతున్న వీడియోను నిషితంగా పరిశీలిస్తే… ధోని ఏదో షూటింగ్ కోసం సెట్‌లో కూర్చున్నట్లు చూడవచ్చు. సన్నీ డియోల్ కూడా తనతో ఉన్నాడు. త్వరలో IPL 2025 కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దాని కోసమే నిర్వహిస్తున్న షూటింగ్ అయి ఉంటుందని కొందరు అంటున్నారు.