Ind vs Pak : భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ మంతా చాలా ఆసక్తిగా గమనిస్తుంటుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం దుబాయ్ స్టేడియం అంతా అభిమానులతో నిండిపోయింది. 9వ ఓవర్ రెండవ బంతికి హార్దిక్ పాండ్యా 23 పరుగుల స్కోరు వద్ద బాబర్ అజామ్‌ను అవుట్ చేశాడు. దీంతో పాక్ అభిమానులు తీవ్ర ఆవేదన చెందారు. దీని తర్వాత సరిగ్గా ఆరో బంతికే ఇమామ్ ఉల్ హక్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వారంతా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తన రనౌట్ పై పాకిస్తాన్ అభిమానుల స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి గాయం కారణంగా టోర్నమెంట్ కు దూరం అయిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్‌ను పాకిస్తాన్ జట్టులోకి తీసుకున్నారు.
ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్ పెవీలియన్ కు వెళ్తుండగా ఒక పాకిస్తానీ మహిళా అభిమాని ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ మహిళా అభిమాని తెల్లటి దుస్తులు ధరించి ఉన్నట్ల ఫోటోలో కనిపిస్తుంది. మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ కు నిలబడి ఉన్న అక్షర్ పటేల్ ఫర్ ఫెక్ట్ త్రో వేసి స్టంప్ లను కొట్టేశాడు. దీంతో ఆ మహిళా అభిమాని ముఖంలో నిరాశ కనిపించింది. ఆమె కళ్ల నిండా నీళ్లు నిండుకున్నాయి. దాంతో పాటు ఆమె ఆవేదనతో తలపట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇప్పటి వరకు రెండు వికెట్లు కోల్పోయింది.
Imam Ul Haq is run out and Pakistani fans can’t believe it.#INDvsPAK pic.twitter.com/CUk4WQLqOh
— Vishu Tyagi (@VishuTyagiOfc) February 23, 2025
ఇమామ్ ఉల్ హక్ డిసెంబర్ 2023 తర్వాత పాకిస్తాన్ జట్టుకు తిరిగి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టులో తనకు స్థానం లభించలేదు. దీనికి ముందు తను తన చివరి వన్డే మ్యాచ్‌ను అక్టోబర్ 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఆడలేదు. ప్రస్తుతం ఫఖర్ జమాన్ స్థానంలో 15 నెలల తర్వాత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారత జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అతను 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
See the reaction of fans when Imam-ul-Haq was run out.#INDvsPAK #INDvPAK #PAKvIND #PAKvsIND pic.twitter.com/iRZ3YqH7WU
— The sports (@the_sports_x) February 23, 2025