Pro Kabaddi –2024: ప్రో కబడ్డీ లీగ్ సీజన్–11 సిరీస్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. లీగ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్ జట్ల ఎంపిక కోసం చాలా జట్లు శక్తివంచన లేకుండా తలపడుతున్నాయి. తాజాగా పూణెరి పల్టాన్‌తో తెలుగు టైటాన్స్ జట్లు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ఆడింది. ఇందులో 48–36 తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఆరో స్థానం కోసం యూ ముంబా, టైటాన్స్ మధ్య పోటీ ఉంది. అయితే యూ బుంబాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో భారీ తేడాతో ఓడితే తెలుగు టైటాన్స్ ¯ప్లే ఆఫ్‌కు వెళ్తుంది.
విక్టరీతో ముగిసిన టైటాన్స్ లీగ్.
ఇక తెలుగు టైటాన్స్ జట్టు తన లీగ్ మ్యాచ్‌లను విజయంతో ముగించింది. శుక్రవారం(డిసెంబర్ 20న) పూణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లె టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్(15), ఆశిష్ నర్వాల్(11), అంకిత్(6) సత్తా చాటడంతో టైటాన్స్ భారీ విజయం సాధించింది. పుణేరి పల్టాన్ తరఫున ఆర్యవర్ధన్ నవలే(8), అజిత్(10) రాణించినా ఓటమి తప్పలేదు. మ్యాచ ఆరంభం నుంచి టైటాన్స్ ఆధిపత్యం కనబర్చింది. ఫస్ట్ ఆఫ్‌లో పుణేరి పల్టాన్‌ను ఆలౌట్ చేసిన తెలుగు టైటాన్స్ విరామ సమయానికి 25–16 ఆధ్యింలో ఉంది. సెకండాఫ్‌లో పుణెరి పల్తాన్ పుంజుకుంది. దీంతో ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సెకండాఫ్‌లో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి. ఆఖని వరకు ఆధిక్యానిక్న కాపాడుకున్న తెలుగు టైటాన్స్ భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 22 మ్యాచ్‌లలో 12 విజయాలు, 10 ఓటములు టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. ఆరో స్థానంలో ముంబై ఉంది. 20 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలు, ఏడు ఓటములు నమోదు చేసింది. రెండు మ్యాచ్‌లు ౖటñ అయ్యాయి.
ప్లేఆఫ్‌కు జైపూర్..
ఇదిలా ఉంటే.. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 31–28 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో జైపూర్ ప్లే ఆఫ్‌కు చేరింది. అర్జున్ దేశ్‌వాల్(9) జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ప్లేఆఫ్ ఫార్మాట్ ఇదీ..
ప్రో కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయి. టాప్–2లో నిలిచిన జట్లు నేరుగా సెమీ ఫైనల్స్–1 ఆడతాయి. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు సెమీఫైనల్–2 ఆడతాయి. సెమీఫైనల్–1, 2లలో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి.