https://oktelugu.com/

India Vs Pakistan: ఇవాళ్టి మ్యాచ్ రద్దయితే ఇండియా ఫైనల్ చేరడం కష్టమే…

ఇక బాంగ్లాదేశ్ రెండు మ్యాచులు ఆడితే రెండు మ్యాచులు ఓడిపోయింది అయితే ఇండియా ఆడే మొదటి మ్యాచ్ ఇదే కావడం వల్ల ఇండియా ఇంకా రెండు మ్యాచులు ఆడుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : September 11, 2023 / 05:42 PM IST

    India Vs Pakistan

    Follow us on

    India Vs Pakistan: ఇండియా పాకిస్థాన్ టీంల మధ్య మ్యాచ్ జరగడం కష్టం గానే కనిపిస్తుంది.ఎందుకంటే ఇవాళ్ల పొద్దునుంచి కొలంబోలో అసలు కొంచం కూడా తగ్గకుండా వర్షం పడుతూనే ఉంది.ఇక ఇవాళ్ల కూడా వర్షం పడటం ఆగిపోతే ఈ మ్యాచ్ ని కూడా రద్దు చేసి చెరో పాయింట్ ఇస్తారు కానీ ఇలా ఇవ్వడం వల్ల పాకిస్థాన్ కంటే ఇండియా భారీ గా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ రద్దయితే నెక్స్ట్ బంగ్లాదేశ్ మీద జరగాల్సిన మ్యాచ్ శ్రీలంక మీద జరగాల్సిన మ్యాచ్ లు రెండు కూడా వర్షం వల్ల రద్దయితే వాటి నుంచి కూడా చెరో పాయింట్ ఇండియా కి వస్తుంది అలా చేయడం వల్ల ఇండియా ఫైనల్ కి వెళ్లడం కష్టం అవుతుంది ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఒక మ్యాచ్ గెలిచి చెరో రెండు పాయింట్ల తో టాప్ టు పొజిషన్ లో ఉన్నాయి.

    ఇక బాంగ్లాదేశ్ రెండు మ్యాచులు ఆడితే రెండు మ్యాచులు ఓడిపోయింది అయితే ఇండియా ఆడే మొదటి మ్యాచ్ ఇదే కావడం వల్ల ఇండియా ఇంకా రెండు మ్యాచులు ఆడుతుంది.కానీ ఇప్పుడు ఆడుతున్న మ్యాచ్ రద్దయితే ఇండియా కి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది.దాంతో శ్రీలంక మీద మ్యాచ్ బాంగ్లాదేశ్ మీద మ్యాచ్ కి కూడా వర్షం అడ్డంకి వస్తే ఇండియా కి తల పాయింట్ చొప్పున రెండు పాయింట్లు వస్తాయి ఇక ఈ మ్యాచ్ లో ఒక పాయింట్ మొత్తం మూడు పాయింట్లు సాదిస్తుంది.ఇక ఇప్పటికే రెండు పాయింట్లు ఉన్న పాకిస్థాన్ కి ఈ మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ వస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడే మూడు పాయింట్లు వస్తాయి ఒక వేళా శ్రీలంక పాకిస్థాన్ ని ఓడిస్తే శ్రీలంక కి నాలుగు పాయింట్స్ తో టాప్ పొజిషన్ కి వెళ్తుంది. అలాగే శ్రీలంక ఇండియా మీద ఆడే మ్యాచ్ రద్దు అయితే ఒక పాయింట్ వస్తుంది మొత్తం ఐదు పాయింట్లు అవుతాయి దాంతో శ్రీలంక ఫైనల్ కి వెళ్తుంది. ఇక ఆల్రెడీ పాకిస్థాన్ కి కూడా మూడు పాయింట్లు ఉన్నాయి అలాగే రన్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఫైనల్ కి వెళ్తారు ఇక మన ఇండియా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ మనం గెలవడం మనకు చాలా అవసరం…

    ఈ మ్యాచ్ గెలిస్తే మిగితా మ్యాచుల మీద ఇండియా డిపెండ్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇండియా కి ఆల్రెడీ రెండు పాయింట్లు వస్తాయి కాబట్టి మిగితా మ్యాచులు రద్దయిన పెద్ద ప్రాబ్లమ్ ఉండదు లాగే మన రన్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.ఇక ఈ మ్యాచ్ అందుకే ఇండియా టీం కి చాల కీలకం గా మారింది…