India Women vs Australia Women India Women vs Australia Womenగ్రూప్ ఏ లో సెమీస్ లో ఆస్ట్రేలియా ఇప్పటికే బెర్త్ ఖాయం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్ నుంచి నిష్క్రమించే అవకాశాలు లేవు. గ్రూప్ – ఏ లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్ వెళ్లడానికి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. ఎటువంటి ఈక్వేషన్స్ లేకుండానే సెమీస్ వెళ్తుంది. ఒకవేళ పాకిస్తాన్తో సోమవారం జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతే అప్పుడు సమీకరణాలు మారుతాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే నెట్ రన్ రేట్ అప్పుడు కీలకంగా మారుతుంది..
సెమీస్ బెర్త్ ను ప్రభావితం చేసే అంశాలు ఇవే..
భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు కనీసం ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా పై గెలిస్తే.. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్ పై సోమవారం జరిగే మ్యాచ్లో కనీసం 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకోవాలి. ఒకవేళ భారత్ పది పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. న్యూజిలాండ్ నాలుగు ఓవర్ల ముందుగానే పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించాలి..
20 ఓవర్ల లోపే లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ఒకవేళ భారత జట్టు లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లలోనే దానిని పూర్తి చేయాలి. అప్పుడు న్యూజిలాండ్ పాకిస్తాన్ జట్టుపై 19 రన్స్ తేడాతో విజయం సాధించాలి. అప్పుడు టీమిండియా 6 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధిస్తే.. న్యూజిలాండ్ తన మ్యాచ్లో కనీసం 26 రన్స్ తేడాతో విక్టరీని సాధించాలి.
న్యూజిలాండ్ అంత వ్యత్యాసంతో గెలవాలి
భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాపై వన్ రన్ తేడాతో గెలిచినా.. న్యూజిలాండ్ మాత్రం పాకిస్తాన్ పై కనీసం 17 రన్ తేడాతో గెలుపును దక్కించుకోవాలి. ఒకవేళ భారత్ పది పరుగుల తేడాతో గెలిస్తే.. అప్పుడు న్యూజిలాండ్ 27 రన్స్ తేడాతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపించాలి.. ఒకవేళ స్వల్ప తేడాతో గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ భారత జట్టును బీట్ చేయడం దాదాపు కష్టం.
చేజింగ్ విషయంలో ఇలా చేయాలి..
ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్ లో భారత్ ఒకవేళ చేజింగ్ చేయాల్సి వస్తే.. అప్పుడు 20 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ను ఫినిష్ చేయాలి. అప్పుడు పాకిస్తాన్ చెట్టుపై న్యూజిలాండ్ 14 బాల్స్ మిగిలి ఉండగానే విక్టరీని సాధించాలి. ఒకవేళ భారత్ 6 బాల్స్ మిగిలి ఉండగానే విక్టరీని సాధిస్తే.. అది న్యూజిలాండ్ జట్టుకు మరింత ఇబ్బందిగా మారుతుంది. టార్గెట్ ను కనీసం 20 బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేయాలి. అయితే రెండు జట్లు సాధించిన పరుగుల ప్రకారం కూడా ఈ ఈక్వేషన్స్ చేంజ్ అవుతుంటాయి.