https://oktelugu.com/

U19 World Cup 2024: మళ్లీ రిపీట్.. ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్.. గెలుపు ఎవరిది.?

ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లలో ఆవాజ్ 52 పరుగులు చేయగా, మినాజ్ 52 పరుగులు చేశాడు. వీళ్లిద్దరిని మినహాయిస్తే టీంలో ఏ ప్లేయర్ కూడా పెద్దగా రాణించకపోవడంతో ఈ మ్యాచ్ లో వాళ్ళు భారీ స్కోర్ చేయలేకపోయారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2024 10:34 am
    India vs Australia final
    Follow us on

    U19 World Cup 2024: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ చివరి దశ కు చేరుకుంది. ఇక ఇప్పటికే ఇండియా ఫైనల్ కి చేరుకోగా, ఇండియా తో తల పడే టీమ్ ఏదో తెలిసిపోయింది. ఇక నిన్న జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ ను చిత్తు చేసి ఫైనల్ కి చేరుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్ 179 పరుగులు చేయగా, 9 వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా 181 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకొని ఘన విజయం సాధించింది. ఇక దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇండియా తో తలపడనుంది.

    ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లలో ఆవాజ్ 52 పరుగులు చేయగా, మినాజ్ 52 పరుగులు చేశాడు. వీళ్లిద్దరిని మినహాయిస్తే టీంలో ఏ ప్లేయర్ కూడా పెద్దగా రాణించకపోవడంతో ఈ మ్యాచ్ లో వాళ్ళు భారీ స్కోర్ చేయలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ బౌలర్లలో టామ్ స్ట్రాకర్ 6 వికెట్లు తీసి పాకిస్తాన్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఆయన దెబ్బకి పాకిస్తాన్ 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెనర్ ప్లేయర్ అయిన డిక్షన్ 50 పరుగులు చేయగా, పీక్ 49 పరుగులు చేసి వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు.

    ఇక దాంతో ఫైనల్ కి చేరిన ఆస్ట్రేలియా ఆదివారం ఇండియాతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది. ఇక ఇదంతా చూసిన ఇండియన్ అభిమానులు గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ లో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో తలపడితే ఆస్ట్రేలియాను ఇండియా చిత్తు చేసింది. దానికి రివేంజ్ గా ఇప్పుడు మన ప్లేయర్లు ఆస్ట్రేలియా ను చిత్తుగా ఓడించి వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలనే ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మన ప్లేయర్లు కూడా ఆ విధంగానే భావిస్తూ ముందుకు కదులుతున్నారు. చూడాలి మరి ఆదివారం ఎవరిపైన ఏ టీమ్ పై చేయి సాధిస్తారో…