https://oktelugu.com/

ICC Test Rankings: సునామీ లాగా దూసుకు వచ్చిన రిషబ్ పంత్.. విరాట్, కోహ్లీ స్థానాలు గల్లంతు

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్.. ఎటాకింగ్ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో సత్తా చాటాడు. సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 26, 2024 / 08:19 AM IST

    ICC Test Rankings

    Follow us on

    ICC Test Rankings: బంగ్లాదేశ్ జట్టుతో ఇటీవల చెన్నైలో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 280 పరుగుల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. భారత్ గెలిచినప్పటికీ టీమిండియా సారధి రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విఫలమయ్యారు. వారి స్థాయికి తగ్గట్టు ఆట తీరు ప్రదర్శించలేకపోయారు. ముఖ్యంగా రోహిత్ తొలి ఇన్నింగ్స్ లో ఆరుపరుగులకు అవుతాడు. విరాట్ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులు చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో 17 పరుగులకే అవుట్ అయ్యాడు. కీలక ఆటగాళ్లు అవుట్ కావడంతో మిగతా వారిపై జట్టు భారం పడింది. దీంతో రిషబ్ పంత్, గిల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు తమ బ్యాట్ కు పని చెప్పాల్సి వచ్చింది. అందువల్లే టీం ఇండియా ఆ స్థాయిలో స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీ చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సెంచరీ చేసిన నేపథ్యంలో రిషబ్ పంత్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో విరాట్, రోహిత్ ను అవలీలగా దాటేశాడు. టాప్-10 లో చోటు దక్కించుకున్నాడు.

    ఎన్నో ఆశలు పెట్టుకుంటే..

    బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విరాట్ పై అభిమానులతో పాటు భారత జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది. అయితే అతడు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 23 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా టెస్టులలో ఐసీసీ ప్రకటించే బెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్ లో విరాట్ తన స్థానాన్ని కోల్పోయాడు. ఏకంగా ఐదు స్థానాలు దిగజారి 12వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదే దుస్థితిని అనుభవిస్తున్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లలో అతడు కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఏకంగా ఐదు స్థానాలకు కోల్పోయి పదవ స్థానానికి పరిమితమయ్యాడు.

    అదరగొట్టిన పంత్

    సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై.. ఆసుపత్రిలో చికిత్స పొంది మైదానంలోకి తిరిగి ప్రవేశించిన రిషబ్ పంత్.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు దీంతో అతడేకంగా టాప్ ర్యాంక్ జాబితాలోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి చేసువాల్ ఐదవ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే జైస్వాల్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. అధికంగా సచిన్ టెండూల్కర్ రికార్డులపై కన్నేశాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్, మిచెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాడు నాలుగో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ -1 లో కొనసాగుతున్నాడు. మంగళ జట్టుతో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో అతడు వికెట్లు తీయకపోయినప్పటికీ, సెంచరీ చేశాడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు ఇక రెండో స్థానంలో జస్ ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులు చేసిన నేపథ్యంలో.. స్థానాన్ని మెరుగుపరుచుకొని.. ఆరవ ర్యాంకు కు చేరుకున్నాడు.