https://oktelugu.com/

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ కొందామనుకుంటున్నారా.. అయితే ఈ ఆఫర్లు మీ కోసమే.. నచ్చింది బుక్‌ చేసుకోండి!

ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్ర తదితర సంస్థలు దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సెప్టెంబర్‌ 27 నుంచి ఆఫర్లు ప్రారంభం కానున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 26, 2024 / 08:27 AM IST

    Smartphone

    Follow us on

    Smartphone: దేశంలో అతిపెద్ద ఈకామర్స్‌ సంస్థలు అయిన అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మీ షో, మింత్ర తదితర ఈకామర్స్‌ సంస్థలు బిగ్‌ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో భారీ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఎప్పుడూ ఊహించని.. ఎవరి ఊహకు అందరి ఆఫర్ల ఉన్నాయని ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నాయి. ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దని కోరుతున్నాయి. నిత్యావసర వస్తువుతలోపాటు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, దుస్తులు, ఫోన్లపై భారీ ఆఫరుల ఇస్తున్నాయి. కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం. ఈ ఆఫర్లు నచ్చితే వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు. అమేజాన్ ప్రైమ్‌ మెంబర్లు, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు సెప్టెంబర్‌ 26 నుంచి సేల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. సాధారణ యూజర్లు సెప్టెంబర్‌ 27 నంచి కొనుగోలు చేయవచ్చు. ఆఫర్లమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు లభించే అవకాశం ఉండడంతో కొత్త ఫోన్‌ కొనాలనుకునేవారు సిద్ధమవుతున్నారు. మీ బడ్జెట్‌ ఆధారంగా ఇందులో మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పరిశీలించండి.

    రూ.10 వేల ఫోన్లు ఇవే..

    – రూ.10 వేల లోపు ఫోన్లలో శాంసంగ్‌ బ్రాండ్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తుంటే ఏ14 5జీ మంచి ఆప్షన్‌. 6.6 ఇంచుల డిస్‌ప్లేతో ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 50 ఎంపీ కెమరాతో ఫోన్‌ వస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. సేల్‌లో దీని ధర రూ.9,999గా నిర్ణయించింది. చార్జర్‌ వేరుగా కొనాలి. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

    – మోటరోలా నుంచి జీ34 ఫోన్‌ 5జీ. ఈ సేల్‌లో రూ.9,999 కే లభిస్తుంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. మెరుగైన పనితీరు కోసం 8జీబీ వేరియంట్‌ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది.

    – ఐక్యూ బ్రాండ్‌ నుంచి జెడ్‌9 లైట్‌ రూ.9,499 కి లభిస్తుంది. మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 6,300 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

    – మీడియాటెక్‌ డైమెన్‌ సిటీ 6100+ ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌ కూడా రూ.10 వేల్లోపు లభిస్తోంది. అమెజాన్‌ ఈ సేల్‌ భాగంగా దీన్ని రూ.8,999కే విక్రయిస్తోంది.

    రూ.15 వేలలోపు ఫోన్లు ఇవే..

    – శాంసంగ్‌ నుంచి ఎం35 5జీ అమెజాన్‌లో ఈ సేల్‌ లో రూ.13,749కే లభిస్తుంది. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎగ్జినోస్‌ 1,380 ప్రాసెసర్, 50 మెగా పిక్సల్‌ కెమెరాతో ఫోన్‌ వస్తోంది. ఛార్జర్‌ వేరేగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

    – ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ మోటోరోలా జీ64 5జీ రూ.13,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌ 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 50 మెగా పిక్సల్‌ కెమెరా, 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

    – రూ.15 వేల ధరలో రియల్‌మీ నుంచి 3 ఫోన్లు ఉన్నాయి. గేమింగ్‌ ప్రయారిటీ అనుకునేవాళ్లు ఫ్లిప్‌కార్ట్‌ రియల్‌మీ నార్జో 70 టర్బో ఉంది. ఇది రూ.14,999కు లభిస్తుంది. కెమెరా కోసం నార్జ్‌ 70 ప్రో (రూ.14,999) తీసుకోవచ్చు. ఇది అమెజాన్‌లో లభిస్తోంది. రియల్‌మీ నార్జ్‌ 70 ఎక్స్‌ కూడా పరిశీలించొచ్చు.

    – వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లాగా ఉండే ఒప్పో కే12ఎక్స్‌ కూడా రూ.10,999కే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. డ్యామేజ్‌ ప్రూప్‌ బాడీ దీని ప్రత్యేకత. 6.67 అంగుళాల హెచ్‌ఎ డిస్‌ప్లే, 32 ఎంపీ కెమెరా, 5100