ICC Test Rankings: టీమిండియానే తోపు ఇక.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సూపర్‌ న్యూస్‌

జూన్‌ 7న జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియా– టీమిండియా మధ్య టైటిల్‌ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే.

Written By: Raj Shekar, Updated On : May 3, 2023 9:23 am
Follow us on

ICC Test Rankings: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి నంబర్‌ వన్‌కు చేరుకుంది. ఐసీసీ విడుదల చేసిన వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న రోహిత్‌ సేన.. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఫస్ట్‌ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా 15 నెలల ఆధిపత్యానికి చెక్‌ పడినట్లయింది. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ను టీమిండియా దెబ్బకు రెండో ప్లేస్‌లోకి వచ్చింది. 20–22 మధ్యలో ఆసీస్‌ గెలిచిన సిరీస్‌లకు తక్కువ వెయిటేజ్‌ ఉండటంతో ఆసీస్‌ 5 పాయింట్లు కోల్పోయి(121 నుంచి 116 పాయింట్ల) ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. టీ20ల్లో కూడా నంబర్‌ వన్‌ స్థానంలో నిలవగా.. వన్డేల్లో మూడోస్థానంలో నిలిచింది.

టీమిండియాకు బూస్ట్‌..
జూన్‌ 7న జరుగనున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియా– టీమిండియా మధ్య టైటిల్‌ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ ఫలితాల్లో భారత్‌కు టాప్‌ ర్యాంక్‌ సాధించడం టీమిండియాకు మంచి బూస్టప్‌ అని చెప్పవచ్చు. దీని ప్రభావం డబ్ల్యూటీసీ ఫైనల్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌.

25 మ్యాచ్‌ల్లో 3031 పాయింట్లు..
గత 25 మ్యాచ్‌ల్లో భారత్‌ 3031 పాయింట్లు సాధించగా.. మొత్తం 121 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా 23 మ్యాచ్‌ల్లో 2,679 పాయింట్లు సాధించి.. 116 రేటింగ్‌ పాయింట్లతో రెండోస్థానానికి పరిమితమైంది. ఇటీవల ఆసీస్‌ జరిగిన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2–1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ గెలుపుతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత్‌ అర్హత సాధించంతోపాటు.. కంగారూ జట్టును వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌ జట్టుగానూ నిలిచింది. 2021–23 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో నిలవగా.. భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. మొదటి ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ నాయకత్వంలోని భారత్‌.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది.

టీ20లోనూ నంబర్‌ వన్‌..
టెస్ట్‌ ర్యాంకింగ్స్‌తోపాటు టీ20 ఫార్మాట్‌లోనూ భారత్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టీమిండియా 267 రేటింగ్‌ పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్‌ 259 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. వన్డే ర్యాంక్సింగ్స్‌లో 113 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. రెండోస్థానంలో కివీస్‌ ఉండగా.. భారత్‌ మూడోస్థానంలో ఉంది. మూడు జట్లకు సమాన పాయింట్లు ఉన్నా.. దశాంశ పాయింట్ల తేడాతో నంబర్‌ వన్‌ స్థానం ఆసీస్‌ సొంతమైంది.

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ఇలా..
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌(121), ఆస్ట్రేలియా(116) తర్వాత ఇంగ్లండ్‌(114), సౌతాఫ్రికా(104), న్యూజిలాండ్‌(100), పాకిస్థాన్‌(86), శ్రీలంక(84), వెస్టిండీస్‌(76), బంగ్లాదేశ్‌(45), జింబాబ్వే(32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.