ICC T20 World Cup 2021: షెడ్యూల్ ఇదే: ఇండియా, పాక్ పోరు ఇప్పుడే

ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన సంబరం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఒమన్ లలో జరుగనుంది. ఈ టీ20 ప్రపంచకప్ లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ లు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ హైటెన్షన్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. టీంలను రెండు […]

Written By: NARESH, Updated On : August 17, 2021 1:28 pm
Follow us on

ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన సంబరం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఒమన్ లలో జరుగనుంది.

ఈ టీ20 ప్రపంచకప్ లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ లు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ హైటెన్షన్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

టీంలను రెండు గ్రూపులుగా విభించారు. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతుండగా.. గ్రూప్ 2లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. ఈ రెండు గ్రూపులలోని 4 స్థానాల కోసం రౌండ్ 1 లో గ్రూప్ఏ, గ్రూప్ బీ టీమ్స్ తలపడుతున్నాయి.

అక్టోబర్ 17న క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. టీంలను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అక్టోబర్ 23న తలపడుతాయి. సాయంత్రం మ్యాచ్ లో ఇంగ్లండ్ , వెస్టిండీస్ ను దుబాయ్ లో ఢీకొంటాయి. భారత్ -పాకిస్తాన్ లాగానే శత్రుదేశాలైన కీలకమైన అస్ట్రేలియా, ఇంగ్లండ్ పోరు అక్టోబర్ 30న తలపడనున్నాయి.

గ్రూప్ 2లో లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ లో తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్రూప్ 2లో భారత్ తోపాటు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు బలంగా ఉన్నాయి. వీటిని ఓడిస్తే సునాయసంగా భారత్ సెమీస్ కు చేరుతుంది.

నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఓమన్, యూఏఈల్లో జరుగుతాయి. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ఐపీఎల్ముగిసిన అనంతరం అక్టోబర్ 17 న టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ మ్యాచులతో ఈ సంరంభం ఆరంభం కానుంది.