తెలంగాణలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కలుషితాహారం తిని ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మనోహరాబాద్ సమీపంలోని కోళ్ల ఫాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల తల్లిని తుఫ్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తుఫ్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మనీషా (13), కుమార్ (10) గా గుర్తించారు.