ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ : దూసుకొచ్చిన విరాట్, రాహుల్, రోహిత్ పరిస్థితి ఘోరం…

టాప్ టెన్ లో ఉన్న బ్యాట్స్ మెన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం... నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా పాకిస్తాన్ బ్యాట్ మెన్ అయిన బాబర్ అజమ్ 835 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

Written By: Gopi, Updated On : October 12, 2023 9:07 am

ICC ODI Rankings

Follow us on

ICC ODI Rankings: ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ టీం ప్లేయర్లు మెరుగైన ర్యాంకింగ్స్ తో తమ సత్తా చాటుకున్నారు. విరాట్ కోహ్లీ ఏడో స్థానంలో నిలువగా, కేల్ రాహుల్ మాత్రం ఆస్ట్రేలియా తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో 97 పరుగులు చేసి వన్డే ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు ఎగబాకి 19 వ స్థానంలో నిలిచాడు.

ముఖ్యంగా ఇండియా తరఫున చాలా సంవత్సరాల నుంచి నెంబర్ 10 లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీని ఈ విషయంలో మనం చాలా వరకు మెచ్చుకోవచ్చు. ఎంతమంది విదేశీ ప్లేయర్ల నుంచి పోటీ ఎదురైనా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఫామ్ లో ఉన్న లేకపోయిన కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ నెంబర్ 10 లో స్థానాన్ని మాత్రం పదిలంగా ఉంచుకుంటున్నాడు… ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు కాబట్టి తను కూడా తొందరలోనే టాప్ టెన్ లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి…

ఇక టాప్ టెన్ లో ఉన్న బ్యాట్స్ మెన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం… నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా పాకిస్తాన్ బ్యాట్ మెన్ అయిన బాబర్ అజమ్ 835 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇండియన్ యువ ఓపెనర్ ప్లేయర్ అయిన శుభ్ మన్ గిల్ 830 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక వీళ్లిద్దరి మధ్య ఒక 5 పాయింట్ల తేడా మాత్రమే ఉండటంతో శుభ్ మన్ గిల్ ఎప్పుడైనా బాబర్ అజమ్ ప్లేస్ ని ఆక్రమించవచ్చు అని ఇప్పటికే చాలామంది లెజెండరీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ దశలోనే అత్యుత్తమైన ఫామ్ ని కనబరుస్తు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలిగే శుభ్ మన్ గిల్ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీకి మాత్రం దూరమయ్యాడు. ఎందుకు అంటే ఆయన ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ తో చాలా ఇబ్బంది పడుతున్నాడు దానివల్లే ఆయన మొదటి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు ఇక తర్వాత జరిగే మ్యాచ్ లకి వస్తాడో లేదో చూడాలి…

ఇక నెంబర్ 3 పొజిషన్ లో సౌత్ ఆఫ్రికా కు చెందిన వండర్ డసెన్ అలాగే నెంబర్ ఫోర్ లో హరి టేక్టర్,నెంబర్ ఫైవ్ లో డేవిడ్ వార్నర్,నెంబర్ సిక్స్ లో క్వింటన్ డికాక్ ,నెంబర్ సేవన్ లో విరాట్ కోహ్లీ, నెంబర్ ఎయిట్ లో డేవిడ్ మలాన్ ,నెంబర్ నైన్ లో ఇమామ్ ఉల్ హక్, నెంబర్ 10 లో క్లాసిన్ లాంటి ప్లేయర్లు టాప్ టెన్ పొజిషన్ లలో కొనసాగుతున్నారు.ఇక ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మొన్నటి దాకా నెంబర్ టెన్త్ పొజిషన్ లో కొనసాగినప్పటికీ ఇప్పుడు ఒక స్థానం దిగజారి నెంబర్ 11 పొజిషన్ లో కొనసాగుతున్నాడు…ఇక నిన్న జరిగిన ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటుకున్నాడు కాబట్టి రోహిత్ శర్మ మళ్ళీ టాప్ టెన్ లో చోటు దక్కించుకునే అవకాశం అయితే ఉంది….

ఇక ఇది ఇలా ఉంటే బౌలింగ్ విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసరైనా జోష్ హజిల్ వుడ్ 682 పాయింట్ల తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆయన తర్వాత ఇండియన్ టీం పేస్ బౌలర్ అయిన మహామ్మద్ సిరాజ్ 664 పాయింట్లతో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక నెంబర్ త్రీ లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్, నెంబర్ 4లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయిన ముజుబి ఉర్ రహమాన్, నెంబర్ ఫిఫ్త్ లో మ్యట్ హెన్రీ లు కొనసాగుతున్నారు. ఇక ఇండియన్ టీంకు చెందిన కుల్దీప్ యాదవ్ మాత్రం నెంబర్ 8 పోసిషన్ ని దక్కించుకున్నాడు… బౌలింగ్ లో అత్యంత ప్రభావం చూపించగల టీం గా చెప్పుకునే పాకిస్తాన్ టీం కి చెందిన ఏ ఒక్క ప్లేయర్ కూడా టాప్ టెన్ లో నిలవలేదు.ఇక నెంబర్ 11 పొజిషన్ లో పాకిస్థాన్ కి చెందిన షాహిన్ అఫ్రిది ఉన్నాడు…