Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్… అందరి ముందు అమ్మాయి ఒంటిపై షర్ట్ లాగేసి అమర్ దీప్ వేధింపులు!

ఈ గేమ్ లో అమర్ ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. మెరూన్ కలర్ వస్తువు తేవాలని బిగ్ బాస్ సూచించగా ఇరు టీమ్స్ నుండి అశ్విని, అమర్ పోటీ పడ్డారు. ఇంట్లో మెరూన్ కలర్ వస్తువు వెతకడానికి బదులు అశ్విని చేతిలో ఉన్న వస్తువు లాక్కునే ప్రయత్నం చేశాడు అమర్.

Written By: Shiva, Updated On : October 12, 2023 9:14 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆరో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా విభజించి బిగ్ బాస్ టాస్క్స్ నిర్వహిస్తున్నారు. వైల్డ్ కార్డు ద్వారా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళను పోటుగాళ్ళు గా పాత వాళ్ళను ఆటగాళ్లుగా విభజించారు. ఎవరు ఫాస్టెస్ట్ అనే టాస్క్ లో బిగ్ బాస్ ఒక కలర్ సూచిస్తాడు. రెండు టీమ్స్ నుండి ఒక్కో సభ్యుడు పరుగున వెళ్లి సదరు కలర్ లో ఉన్న వస్తువు ఇంట్లో నుండి తెచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న సర్కిల్ లో పెట్టాలి. ఎవరు ముందుగా కచ్చితమైన కలర్ వస్తువు తెస్తే వారికి పాయింట్స్ లభిస్తాయి.

ఈ గేమ్ లో అమర్ ప్రవర్తన వివాదాస్పదం అయ్యింది. మెరూన్ కలర్ వస్తువు తేవాలని బిగ్ బాస్ సూచించగా ఇరు టీమ్స్ నుండి అశ్విని, అమర్ పోటీ పడ్డారు. ఇంట్లో మెరూన్ కలర్ వస్తువు వెతకడానికి బదులు అశ్విని చేతిలో ఉన్న వస్తువు లాక్కునే ప్రయత్నం చేశాడు అమర్. ఆమె డిపెండ్ చేసుకోబోయింది. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకుంది. అమ్మాయి అని కూడా చూడకుండా అమర్ ఆమెపై పడిపోయాడు.

అశ్విని మెరూన్ కలర్ టీ షర్ట్ తో బయటకు వచ్చేందుకు చూసింది. అమర్ తన దగ్గరున్న టీ షర్ట్ తీసుకోకుండా దాన్ని ధరించింది. దాంతో అమర్ ఆమె టీ షర్ట్ విప్పేందుకు ట్రై చేశాడు. అది కరెక్ట్ కాదని హౌస్ మేట్స్ అతన్ని వారించారు. అయినా అమర్ వినలేదు. దాంతో పోటుగాళ్ళ టీమ్ సభ్యుడైన భోలే షావలి ఏమిటీ హరాస్మెంట్ అని కోప్పడ్డాడు. ఈ విషయంలో అమర్ దీప్ ని బిగ్ బాస్ కూడా హెచ్చరించాడు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు టీమ్ విజయం సాధించారు.

అనంతరం మరో టఫ్ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు. బరువైన రాకెట్స్ ని రెండు చేతులతో క్రింద పడిపోకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్ లో నేను పోటీ పడతానని అమర్ దీప్ అన్నాడు. నీ వల్ల కాదని శివాజీ ఆపాడు. ఆటగాళ్ల నుండి యావర్, పోటు గాళ్ళ నుండి అర్జున్ పోటీ పడ్డారు. అర్జున్ ఎక్కువ సేపు పట్టుకుని ఈ టాస్క్ లో గెలిచాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్ కి లీడర్షిప్ క్వాలిటీస్ లేవని మెజారిటీ ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు. దాంతో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ ని బిగ్ బాస్ రద్దు చేశాడు. అతడికి దక్కిన ఇమ్యూనిటీ మాత్రం కొనసాగుతుందని అన్నాడు.