Sreeleela Completes MBBS: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి శ్రీలీల. ‘పెళ్లి సందడి’ సినిమాతో మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్, చూస్తూ ఉండగానే భారీ సినిమాలు చేస్తూ పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈమె తమిళం, హిందీ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటుంది. అయితే ఈమె ఒక MBBS విద్యార్థి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ, తన డాక్టర్ చదువు ని మాత్రం వదల్లేదు. షూటింగ్ విరామం సమయం లో, అదే విధంగా ఇతర ఖాళీ సమయాల్లో MBBS పరీక్షల కోసం చదువుకుంటూ ఉండేది.
అలా చదువుకుంటూనే MBBS పరీక్షలు పూర్తి చేసింది. రీసెంట్ గానే ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో ఆమె మంచి మార్కులతో పాస్ అయ్యి MBBS పట్టా పొందింది. ఆమె డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుంటున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సినిమాల్లో స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ శ్రీలీల డాక్టర్ చదువుని మాత్రం వదల్లేదు. ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘ఒక రోజు మా అమ్మమ్మ ఇంట్లో స్పృహ తప్పి క్రింద పడిపోయింది. ఆ సమయంలో ఏమి చెయ్యాలో మాకు అర్థం కాలేదు. అప్పుడే డాక్టర్ అయినటువంటి మా అన్నయ్య వచ్చి చికిత్స చేయగానే ఆమె క్షణాల్లో మామూలు స్థితికి వచ్చింది. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను డాక్టర్ అవ్వాలని’ అంటూ చెప్పుకొచ్చింది. శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా ఒక డాక్టర్ అనే విషయం అందరికీ తేలిసిందే.
ఇక నుండి హీరోయిన్ శ్రీలీల కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, డాక్టర్ శ్రీలీల కూడా. ఇది ఇలా ఉండగా శ్రీలీల సినిమాల విషయానికి వస్తే ఈమధ్య కాలంలో ఈమె చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. తెలుగు లో అదృష్టం కలిసి రావడం లేదని తమిళం లో ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన పరాశక్తి అనే చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలలై భారీ డిజాస్టర్ గా నిల్చింది. ఇప్పుడు ఆమె ఆశలన్నీ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మీదనే ఉంది. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళబోతుంది అని చెప్పొచ్చు.