ICC names 5 best matches of T20 World Cup 2022 : ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2022లో ఐదు అత్యుత్తమ మ్యాచ్‌లు ఏంటో ఐసీసీ పేర్కొంది. ఇందులో భారత్ పాల్గొన్న మూడు మ్యాచ్‌లు ఉండడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించిన మ్యాచ్ ను టోర్నీలోనే నంబర్ 1 అత్యుత్తమ మ్యాచ్ గా అభివర్ణించింది. ఐసిసి దీనిని “టోర్నీనే మలుపుతిప్పిన పరిణామం” అని పేర్కొంది. చివరి బంతికి పాకిస్థాన్‌పై భారత్ విజయాన్ని రెండో అత్యుత్తమ పోరుగా.., పాకిస్థాన్‌పై జింబాబ్వే విజయం మూడో స్థానంలో.. భారత్‌పై ఇంగ్లండ్ గెలుపు నాలుగో స్థానంలో.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయాలను 5వ స్థానంలో చేర్చారు.

-దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ విజయం
ప్రపంచకప్ టోర్నీలో నిజానికి పాకిస్తాన్ స్థానంలో దక్షిణాఫ్రికా సెమీస్ చేరాల్సింది. చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడిస్తే చాలు సౌతాఫ్రికా సెమీస్ చేరేది. సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడేది. కానీ కీలకమైన మ్యాచ్ లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడి దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది. ఇక ఇంటికెళ్లాల్సిన పాకిస్తాన్ సౌతాఫ్రికా ఓటమితో బంగ్లాదేశ్ పై గెలిచి ఫైనల్ చేరింది. టోర్నీని మలుపుతిప్పిన మ్యాచ్ గా దీన్ని వర్ణిస్తారు.
-ఇండియా-పాకిస్తాన్
టీ20 ప్రపంచకప్ లోనే అత్యధిక మంది చూసిన మ్యాచ్ ఇండియా , పాకిస్తాన్. ఓడిపోతుందనుకున్న టీమిండియాను విరాట్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో చివరి బంతికి గెలిపించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇది టోర్నీలోనే రెండో అత్యుత్తమ మ్యాచ్ గా నిలిచింది.
-జింబాబ్వే-పాకిస్తాన్..
భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్ తన రెండో మ్యాచ్ లో జింబాబ్వే చేతిలోనే ఓడింది. కేవలం 1 రన్ తేడాతో పాక్ ను జింబాబ్వే మట్టికరిపించింది. బలమైన పాక్ నడ్డి విరిచింది. చివరి వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ టోర్నీలోనే మూడో అత్యుత్తమైనది కావడం గమనార్హం.
-ఇంగ్లండ్-ఇండియా సెమీస్
దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల ఆపసోపాలు పడి చేస్తే ఇంగ్లండ్ ఓపెనర్లే ఇద్దరే ఈ టోటల్ కొట్టేసి భారత్ ను ఇంటికి పంపారు. ఇదో 4వ అత్యుత్తమ మ్యాచ్ గా ఐసీసీ పేర్కొంది.
-సౌతాఫ్రికా -ఇండియా
ఇక ఇండియాకు లీగ్ దశలో తొలి ఓటమి సౌతాఫ్రికా చేతిలో వచ్చింది. 5 వికెట్లతేడాతో ఇండియా ఓడిపోయింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఇచ్చిన క్యాచులు, రనౌట్లు వదిలేసి మరీ సౌతాఫ్రికా గెలుపునకు కారణమైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ను 5వ అత్యుత్తమ గేమ్ గా ఐసీసీ పేర్కొంది.
మొత్తం ఐసీసీ టోర్నమెంట్ లోనే ఈ 5 మ్యాచ్ లు ఉత్కంఠ రేపాయని తెలిపింది. ఇందులో మూడు మన టీం మ్యాచ్ లే కావడం విశేషం.