ICC Mens One Day Rankings: వైట్ బాల్ ఫార్మాట్లో (వన్డేలు మాత్రమే) విరాట్ కోహ్లీ (Virat Kohli) భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. టీమిండియా సాధిస్తున్న విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో వరుసగా సెంచరీలు చేసి అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు(IND vs NZ) తో జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా దుమ్ము రేపుతున్నాడు. తొలి వన్డేలో వెంట్రుక వాసిలో సెంచరీని కోల్పోయాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీకి ఐసీసీ (ICC) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీకి నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టింది. విరాట్ కోహ్లీ కి ఏకంగా 785 రేటింగ్ ఇచ్చింది. తన కెరియర్లో విరాట్ కోహ్లీ 2018లో 909 రేటింగ్ సాధించాడు. ఇది అతని కెరియర్ లోనే అత్యుత్తమమైనది. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి 785 రేటింగ్ ఉంది. ఇటీవల అతడు వరుసగా సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేయడంతో ఒక్కసారిగా టాప్ లోకి వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని విరాట్ కోహ్లీ కృత నిశ్చయంతో ఉన్నాడు. అందువల్లే ఈ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. వింటేజ్ విరాట్ కోహ్లీని అభిమానులకు రుచి చూపిస్తున్నాడు. అందువల్లే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. మైదానాలలో జాతర వాతావరణం తలపించే విధంగా అభిమానులు విరాట్ కోహ్లీ నామస్మరణ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు.
విరాట్ కోహ్లీ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు డరిల్ మిచల్(784 రేటింగ్), రోహిత్ శర్మ, (టీమిండియా, 775 రేటింగ్) రెండు, మూడు స్థానాలలో కొనసాగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్(764 రేటింగ్), టీమిండియా కెప్టెన్ గిల్ (725 రేటింగ్), పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్(722 రేటింగ్), ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టేక్టర్(708 రేటింగ్), వెస్టిండీస్ ఆటగాడు హోప్ (701 రేటింగ్), శ్రీలంక ఆటగాడు ఆశలంక (690 రేటింగ్), శ్రేయస్ అయ్యర్ (682 రేటింగ్) నాలుగు నుంచి పది స్థానాలలో కొనసాగుతున్నారు.. ఇటీవల కాలంలో బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన స్టామినా నిరూపించుకున్నారు. అంతేకాదు, వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.