T20 World Cup 2024: ఐపిఎల్ ని మించి.. 2024 టి20 వరల్డ్ కప్ కి ఐసిసి పెద్ద ప్లాన్…

గతంలో మాదిరి కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఈ టోర్నీ నిర్వహించడానికి చూస్తున్నారు.అది ఏంటి అంటే గతంలో తొలి లీగ్ ముగిసిన తర్వాత సూపర్ 12 మ్యాచ్లు ఆడేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా మొత్తం 20 జట్లని నాలుగు గ్రూప్ లుగా చేసి ఒక్క గ్రూపులో 5 జట్లను చేర్చనున్నారు.

Written By: Gopi, Updated On : December 10, 2023 10:29 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: అత్యంత భారీ ఎత్తున ఇండియా లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఇక దానికి ఏమాత్రం తీసుకోకుండా టి20 వరల్డ్ కప్ ని నిర్వహించని ఐసీసీ భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తుంది జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచ్ లకు అమెరికా, వెస్టిండీస్ వేదిక కానున్నాయి… 2022లో టి20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించారు. ఇక ఇప్పుడు అమెరికా,వెస్టిండీస్ వేదికలుగా భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి… మొత్తం ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనగా 10 వేదికలో మ్యాచ్ లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 5 వేదీకలు అమెరికాలోనివి కాగా, మిగతా 5 వేదికలు కరేబియన్ దీవుల్లో నిర్వహించనున్నారు. అమెరికాలో ఎక్కడ నిర్వహించాలని దాని మీద కూడా ఐసిసి ఒక క్లారిటీకి వచ్చింది అందులో భాగంగానే ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ లో నిర్వహించాలని నిర్ణయించారు…

ఇక ఎప్పుడు లేని విధంగా మొత్తం 55 మ్యాచ్ లతో చాలా గ్రాండ్ గా ఈ టోర్నీ ని నిర్వహించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఇటువంటి కీలకమైన మ్యాచులు వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. ఇక ఎప్పటిలాగే ఇండియా పాకిస్తాన్ జట్లు ఇప్పుడు కూడా ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ మీదనే చాలా బిజినెస్ జరిగే అవకాశం కూడా ఉంది…

గతంలో మాదిరి కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఈ టోర్నీ నిర్వహించడానికి చూస్తున్నారు.అది ఏంటి అంటే గతంలో తొలి లీగ్ ముగిసిన తర్వాత సూపర్ 12 మ్యాచ్లు ఆడేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా మొత్తం 20 జట్లని నాలుగు గ్రూప్ లుగా చేసి ఒక్క గ్రూపులో 5 జట్లను చేర్చనున్నారు. ఆ తరువాత ఒక్కో గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా ఆడిస్తారు. ఇక గ్రూప్ దశలో ఆడిన ప్రదర్శన కారణంగా సూపర్-8 షెడ్యూల్ నిర్వహిస్తారు. ఇక ఇక్కడ ఎవరైతే బాగా ఆడుతారో ఆ 4 టీమ్ లు సెమీస్ కి అర్హత సాధిస్తాయి…ఇక ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ఇండియా,నెదర్లాండ్స్, న్యూజిలాండ్ పాకిస్థాన్,సౌతాఫ్రికా,ఆఫ్గనిస్తాన్,బంగ్లాదేశ్ లాంటి టీంలు ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఈ టీంలు డైరెక్ట్ గా ఈ టోర్నీ కి అర్హత సాధించాయి…

ఇక వీటి పరిస్థితి ఇలా ఉంటే స్కాట్లాండ్,ఐర్లాండ్,పాపువా న్యూ గినియ,నేపాల్,ఒమన్,కెనడా,ఆఫ్రికా, నమీబియా, ఉగాండా క్వాలిఫైయర్ మ్యాచ్ ల ద్వారా అర్హత సాధించాయి. చూడాలి మరి ఈసారి ఏ టీమ్ లు మిగితా టీమ్ ల పైన ఆధిపత్యాన్ని ఎలా చూపించబోతున్నాయో చూడాలి…ఇక ఈసారి మాత్రం ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది కాబట్టి ఈ సారి కప్పు కొట్టి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికే ఇండియన్ టీమ్ కి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు…