ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ (ICC Champions trophy) రంజు గా మారింది. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై భారత్ గెలిచింది. ఫలితంగా సెమీఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక భారత్ న్యూజిలాండ్ జట్టుతో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ – బీ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు బలంగా కనిపిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ మీద, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీద విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (AUS vs SA) తలపడుతున్నాయి. ఈ క్రమంలో సెమీఫైనల్ లో భారత్ తలపడే జట్టు ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా అయ్యే అవకాశం ఉంది. రన్ రేట్ ఆధారంగా భారత్ ఎదుర్కొనే జట్టు ఏమిటో తెలుస్తుంది. వరుసగా భారత్ రెండు మ్యాచ్లు గెలిచింది. మూడో మ్యాచ్ కూడా గెలిస్తే సెమీఫైనల్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. బంగ్లాదేశ్ జట్టును పడగొట్టి.. పాకిస్తాన్ జట్టు ను ఓడగొట్టి భారత్ సూపర్ ఆట తీరు ప్రదర్శించింది. ఇక చివరి లీగ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టుతో ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది.. ఈ మ్యాచ్లో గెలిచి గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో నిలవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విజయాలతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఈ రెండు జట్లు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో భారత్ సెమీఫైనల్ వెళ్లడం దాదాపుగా ఖరారయింది.
ఇక దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్ లో 100కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. అందువల్లే ఆ జట్టు రన్ రేట్ అద్భుతంగా ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 350 కంటే ఎక్కువ పరుగుల స్కోర్ చేజ్ చేసి రికార్డు సృష్టించింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా కంటే తక్కువ రన్ రేట్ ఉంది. ఈ రెండు చెట్లకు సమాన పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ విషయంలో దక్షిణాఫ్రికా గ్రూప్ బి లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ రెండు జట్లు ఇదే తీరుగా ఆడితే సెమీఫైనల్ లో భారత్ దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో తల పడాల్సి రావచ్చు..
మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు భారత జట్టుతో తలపడాల్సి రావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో భారత్ గనుక విజయం సాధిస్తే గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒకవేళ భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే గ్రూప్ బి లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుతో పోటీ పడాల్సిన రావచ్చు. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి రెండు మ్యాచ్లను కనుక గెలిస్తే సెమీఫైనల్ చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది.