https://oktelugu.com/

ఈ దశాబ్ధపు ఉత్తమ సారథులు ధోని, కోహ్లీనే

ప్రపంచంలోని మేటి క్రికెటర్లు ఎవరంటే ఖచ్చితంగా అందులో మన టీమిండియా ఆటగాళ్లు ధోని, కోహ్లీ ఉంటారు. దీన్ని ఐసీసీ కూడా గుర్తించింది. తాజాగా ‘ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్’ అవార్డులు ప్రకటించారు. ఇందులో భారత ఆటగాళ్లదే హవా నడవడం విశేషం. Also Read: భారత్‌దే ఆధిపత్యం వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోని సారథిగా , టెస్టు జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ఎంపికవ్వడం విశేషం. ఇద్దరు భారతీయులే ప్రపంచ జట్టుకు నాయకులుగా ఎంపియ్యారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2020 / 06:37 PM IST
    Follow us on

    ప్రపంచంలోని మేటి క్రికెటర్లు ఎవరంటే ఖచ్చితంగా అందులో మన టీమిండియా ఆటగాళ్లు ధోని, కోహ్లీ ఉంటారు. దీన్ని ఐసీసీ కూడా గుర్తించింది. తాజాగా ‘ఐసీసీ టీమ్ ఆఫ్ ది డెకెడ్’ అవార్డులు ప్రకటించారు. ఇందులో భారత ఆటగాళ్లదే హవా నడవడం విశేషం.

    Also Read: భారత్‌దే ఆధిపత్యం

    వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోని సారథిగా , టెస్టు జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ఎంపికవ్వడం విశేషం. ఇద్దరు భారతీయులే ప్రపంచ జట్టుకు నాయకులుగా ఎంపియ్యారు. ఈ దశాద్ధపు అత్యుత్తమ కెప్టెన్లుగా మన ఇద్దరు క్రికెటర్లు నిలవడం గర్వకారంగా మారింది.

    ఈ దశాద్ధపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం ఐసీసీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. టీ20 జట్టులో ధోని, కోహ్లీతోపాటు ఓపెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.

    Also Read: కోహ్లీని మించిపోయిన బుమ్రా

    ఇక వన్డే ఫార్మాట్లో ధోని, రోహిత్, కోహ్లీ చోటు సంపాదించారు. ఇక దశాబ్ధపు టెస్టు జట్టులో కోహ్లీ కెప్టెన్ గా ఎంపికవ్వగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.

    ఇక మహిళల జట్టును కూడా ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి నలుగు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. టీ20లో హర్మన్ ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్ లు ఎంపికయ్యారు. వన్డే జట్టులో మిథాలీరాజ్, జులన్ గోస్వామి చోటు సంపాదించారు. రెండు జట్లకు కెప్టెన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ ఎంపికయ్యారు.