Hyderabad : ఈ సీజన్లో తొలిసారిగా హైదరాబాద్ జట్టు ఆ పని చేసింది. ఓన్ గ్రౌండ్ లో సాగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలేలా చేసింది. వరుసగా షాక్ లు ఇస్తూ దిమ్మతిరిగేలా చేసింది. ఏకంగా ప్రత్యర్థి ఢిల్లీ జట్టును 133 రన్స్ వరకే నిలిపివేయగలిగింది. ఆరు వికెట్ల వరకు హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశారు. అసలు బ్యాట్ తో బంతిని టచ్ చేయడానికి భయపడేలా చేశారు. దీంతో ఓన్ గ్రౌండ్ లో హైదరాబాద్ చేజ్ చేయగలిగే టార్గెటే నమోదయింది. ఇంకేముంది 134 రన్స్ ఈజీగా కొట్టేస్తారు.. ప్లే ఆఫ్ అవకాశాలను కాస్తలో కాస్త లైవ్ గా ఉంచుకుంటారని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు భావించారు. సోషల్ మీడియాలోనూ అదే తీరుగా పోస్టులు పెట్టారు. కానీ రియాల్టీ మాత్రం వేరే విధంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల ఆశలపై.. అభిమానుల అంచనాలపై వర్షం నీళ్లు చల్లే విధంగా ఉంది. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ పూర్తికావడమే ఆలస్యం.. వరుణుడు ఉప్పల్ మీద పడ్డాడు. వర్షాకాలంలో కొట్టినట్టు.. మండు వేసవిలో దంచి కొడుతున్నాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ నిలిచిపోయింది. వర్షానికి తోడు భీకరమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది.
Also Read : CSK, MI పని అయిపోయినట్టేనా..
మ్యాచ్ జరగకపోతే
ప్రస్తుతం పాయింట్లు పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు పది మ్యాచ్లు ఆడి.. మూడు విక్టరీలు మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా గ్రూప్ దశ నుంచే వెళ్లిపోయాయి. హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి ఇంకా హైదరాబాద్ మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.. ఒకవేళ ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే హైదరాబాద్ అఫీషియల్ గా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ తదుపరి మూడు మ్యాచ్లు వరుసగా గెలిచినా.. ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉండదు. ప్లే ఆఫ్ వెళ్లాలంటే గరిష్టంగా 14 కు మించి పాయింట్లు ఉండాలి. అయితే హైదరాబాద్ అభిమానులు వర్షం తగ్గి.. మ్యాచ్ జరిగేలా చూడాలని వరుణ దేవుడికి మొక్కుతున్నారు. మరోవైపు హైదరాబాద్ ప్లేయర్లు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వర్షం గనుక తగ్గితే డక్వర్త్ లూయిస్ విధానంలో పరుగుల సంఖ్యను, ఓవర్ల సంఖ్యను కుదించే అవకాశం ఉంది. అప్పుడు హైదరాబాద్ జట్టు వికెట్లు కోల్పోకుండా అంపైర్లు విధించిన లక్ష్యాన్ని గనుక పూర్తి చేస్తే.. హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో పైకి వెళ్తుంది. ఇవేవీ జరగకుంటే హైదరాబాద్ జట్టు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఇప్పటికే 7 ఓటములు ఎదుర్కొంది. అలాంటప్పుడు ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే.. హైదరాబాద్ జట్టు ఖాతాలో పాయింట్లు ఏడు మాత్రమే ఉంటాయి.
Also Read : ముంబై కెప్టెన్‌కు చుక్కలు! హార్దిక్‌పై రూ.12 లక్షల జరిమానా