Odi World Cup 2023: ఇండియా సౌతాఫ్రికా మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు…

ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇండియన్ టీం లో ఆల్ రౌండర్ ప్లేయర్ అయినా హార్దిక్ పాండ్యా ఈ టోర్నీ నుంచి రూల్డ్ డౌట్ అయి వెళ్ళిపోవడం జరిగింది.

Written By: Gopi, Updated On : November 4, 2023 6:36 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ప్రస్తుతం ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ లో వరుస విజయాలను అందుకుంటూ ఇండియన్ టీం పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తూ వస్తున్నారు. రేపు ఇండియా, సౌతాఫ్రికా తో ఒక భారీ మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది.ఇక ఇప్పటికే 7 మ్యాచ్ లు గెలిచి అపజయం ఎరుగని ఇండియన్ టీం నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో సౌతాఫ్రికా టీమ్ ని చిత్తు చేసి ఎనిమిదవ విజయాన్ని అందుకొని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ ని పదిలంగా ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక గా ఆడబోతున్నారు. ఇక ఇరు జట్లు కూడా ఇప్పటికే కలకత్తా చేరుకున్నాయి.

ఇక ఇండియన్ టీం ఎలాగైతే మ్యాచ్ గెలిచి నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకొని,తమ ఆధిపత్యాన్ని చూపించుకో వాలనుకుంటుందో అలాగే సౌతాఫ్రికా టీం కూడా ఈ మ్యాచ్ లో గెలిచి అఫీషియల్ గా సెమిఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్లు ఆడే ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది…అయితే నవంబర్ 5వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది… దీన్ని టీవీలో చూసేవాళ్ళు అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చూడవచ్చు అలాగే మొబైల్ లో చూసే వాళ్ళు అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు…

ఇక ఇండియన్ టీం లో ఉన్న ప్లేయర్లను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇండియన్ టీం లో ఆల్ రౌండర్ ప్లేయర్ అయినా హార్దిక్ పాండ్యా ఈ టోర్నీ నుంచి రూల్డ్ డౌట్ అయి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అతని ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణ ను టీమ్ లోకి తీసుకు రావడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఇండియన్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మొదట ఓపెనర్లు గా శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ ఉన్నారు. అలాగే నెంబర్ త్రి లో విరాట్ కోహ్లీ, నెంబర్ ఫోర్ లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో సూర్య కుమార్ యాదవ్, నెంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా, నెంబర్ ఎయిట్ లో కుల్దీప్ యాదవ్, నెంబర్ నైన్ లో మహమ్మద్ షమీ, నెంబర్ టెన్ లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 లో జస్ప్రిత్ బుమ్ర లు ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ తరుపున బరిలోకి దిగిపోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక టీమ్ లోకి ఒక ఆల్ రౌండర్ కావాలనుకుంటే మాత్రం సూర్య కుమార్ యాదవ్ ని పక్కన పెట్టి ఆయన ప్లేస్ లో శార్దూల్ ఠాకూర్ ని టీమ్ లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది…