Hardik Pandya: టీమిండియాలో బలమైన హార్ధిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లున్నారా..?

హార్దిక్ పాండ్యా ఒక ఫస్ట్ బౌలర్ అలాగే బ్యాట్స్ మెన్ గా కూడా టీమ్ కి చాలా బాగా హెల్ప్ అవుతాడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

Written By: Gopi, Updated On : November 4, 2023 6:16 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తుంది. ఇప్పటికే వరుస విజయాలను దక్కించుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇండియన్ ప్లేయర్లు కూడా అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ తమదైన రీతిలో మ్యాచులు ఆడుతూ ఇండియన్ టీం పరువు నిలబెడుతూ ఆడుతున్నారు… ఇక ఇలాంటి టీమ్ ని ఢీ కొట్టడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ టీంలు కూడా భయపడుతున్నాయి అంటే ఇండియన్ టీం ఎంత పవర్ ఫుల్ టీమ్ గా తయారు అయిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఈ టీమ్ లో ఉన్న ఒక ప్లేయర్ అనే కాదు అందరు ప్లేయర్లు సమిష్టిగా రాణిస్తూ ఇండియన్ టీం కి తమదైన విజయాలను అందిస్తున్నారు. కాబట్టి ఇండియన్ టీమ్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా ఈ వరల్డ్ కప్ లో మొదటి మూడు మ్యాచ్ ల్లో ఆడి తన ఆట తీరు తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఈయన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయాల బారిన పడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలో ఈయన ప్లేస్ ని భర్తీ చేసే ప్లేయర్ ఇండియాలో ఉన్నారా అనే విషయం మీద చాలా రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పాండ్య గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలియడం తో ఆయన వరల్డ్ కప్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇక దాంతో ప్రసిద్ధి కృష్ణని సెలెక్ట్ చేయడం జరిగింది.

అయితే హార్దిక్ పాండ్యా ఒక ఫస్ట్ బౌలర్ అలాగే బ్యాట్స్ మెన్ గా కూడా టీమ్ కి చాలా బాగా హెల్ప్ అవుతాడు అనే విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇలాంటి సమయంలో హార్థిక్ పాండ్యా ప్లేస్ ని బౌలర్ అయిన ప్రసిద్ది కృష్ణ తో ఎలా ఫుల్ ఫిల్ చేస్తారు అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో తలెత్తుతుంది. నిజానికి హార్దిక్ పాండ్యా లాంటి ఒక హిట్టర్ ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి సరిపడా ప్లేయర్లు ఇండియన్ టీం లో ఉన్నారా అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే శివమ్ దూబే లాంటి ఆల్ రౌండర్ ప్లేయర్లు ఇండియన్ టీం లో ఉన్నప్పటికీ శివమ్ దూబే అంత మ్యాజిక్ అయితే చూపించలేడు. దూబే మంచి బ్యాట్స్ మెన్ అయినప్పటికీ ఆయన బౌలింగ్ లో మాత్రం అంత ఇంపాక్ట్ చూపించడు….కానీ ఒక మంచి హిట్టర్ గా పనిచేస్తాడు మరి ఇలాంటి సమయంలో పాండ్య ప్లేస్ లో ప్రసిద్ధి కృష్ణ లాంటి బౌలర్ ని ఎలా సెలెక్ట్ చేశారు అనేది చర్చనీయాంశం గా మారింది… ఇక దానికి తోడుగా అసలు ప్లేయింగ్ 11 లో ప్రసిద్దికృష్ణ ఉంటాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఎందుకంటే ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా ప్లేస్ లో సూర్య కుమార్ యాదవ్ మాత్రమే ఆడాడు కాబట్టి ఇప్పుడు ప్రసిద్ది కృష్ణని తీసుకోవడం కష్టమే…అందుకే ప్రసిద్ది కృష్ణకి బదులు గా దూబే ని తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పటికే టీమ్ లో ఆల్రెడీ ముగ్గురు పేస్ బౌలర్లు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.అలాగే పాండ్య ప్లేస్ లో ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఒక మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు మరో మ్యాచ్ లో విఫలమవుతున్నాడు.ఇక ఈ క్రమం లో హార్థిక్ పాండ్యా ప్లేస్ లో దూబే ను తీసుకుంటే కనీసం నెంబర్ సిక్స్ లో వచ్చే బ్యాట్స్ మెన్ గా అయిన పనిచేస్తాడు. సూర్య కుమార్ యాదవ్ ని పక్కన పెట్టి దూబే ని పెట్టుకుంటే బాగుండేది ప్రస్తుతం దూబే మంచి ఫామ్ లో ఉన్నాడు అంటూ సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…