IPL 2025 : ఉండే వాళ్ళు ఎవరో, వెళ్లిపోయే వారెవరో తేలిపోయింది.. ఆయా జట్ల వద్ద ఇంకా ఎంత పర్స్ వేల్యూ ఉందంటే?

ఐపీఎల్ 2025 ను అత్యద్భుతంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా అత్యంత ముఖ్యమైన ప్రక్రియ రిటెన్షన్ ను ఘనంగా ముగించింది. పది జట్లు తమ రి టెన్షన్ జాబితాను గురువారం వెల్లడించాయి.

Written By: NARESH, Updated On : October 31, 2024 10:48 pm

IPL 2025

Follow us on

IPL 2025 :  జాతీయ మీడియాలో గత కొద్దిరోజులుగా వార్తల్లో వచ్చినట్టుగానే.. కేఎల్ రాహుల్ లక్నో జట్టుకు గుడ్ బై చెప్పాడు. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు రాం రాం ప్రకటించాడు. శ్రేయస్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో వీరంతా కూడా వేలంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి కోల్ కతా, రాజస్థాన్ జట్లు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. పంజాబ్ జట్టు అత్యంత కనిష్టంగా ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే తమతో అంటిపెట్టుకుంది. బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. గుజరాత్, లక్నో, ముంబై, చెన్నై జట్లు ఐదేసి చొప్పున ఆటగాళ్లను తమతో పాటు ఉంచుకున్నాయి. ఢిల్లీ జట్టు రిషబ్ పంత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. ఆ తర్వాత నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. .

120 కోట్లకు..

ప్రతి జట్టు పర్స్ వేల్యూను ఈసారి బీసీసీఐ భారీగా పెంచింది. ఏకంగా 120 కోట్లకు చేర్చింది. రి టెన్షన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అత్యధికంగా పంజాబ్ జట్టు 110.5 కోట్లను కలిగి ఉంది. పంజాబ్ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ ప్రక్రియలో ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం లేదా ఉన్న వారిని కాపాడుకోవడం కోసం బీసీసీఐకి 9.5 కోట్లను ఖర్చు చేసింది. వేలంలో చాలామంది స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి ఉన్న నేపథ్యంలో పంజాబ్ జట్టు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే రాజస్థాన్ జట్టు వద్ద 41 కోట్లు ఉన్నాయి.. ఈ డబ్బులతో మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక ఈ ప్రకారం హైదరాబాద్ జట్టు వద్ద 45 కోట్ల పర్సు వేల్యూ ఉంది.. ఏ జట్టు వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం..

ఐపీఎల్ జట్ల పర్స్ వాల్యూ ఎలా ఉందంటే..

చెన్నై జట్టు : 55 కోట్లు (ఒక ఆర్టీఎం కార్డు.

ముంబై ఇండియన్స్: ఈ జట్టు వద్ద 45 కోట్ల నగదు ఉంది . అంతేకాదు అన్ క్యాప్డ్ ఆటగాడి కోసం ఈ జట్టు ఎదురుచూస్తోంది…

కోల్ కతా 51 కోట్లు..

ఆటగాళ్ళను రిటైన్ చేసుకున్న తర్వాత కోల్ కతా జట్టు వద్ద నలభై కోట్ల నగదు మిగిలి ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వద్ద ప్రస్తుతం 45 కోట్లు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లకు ఆ జట్టు భారీగా భూములు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

ఇక గుజరాత్ టైటాన్స్

గుజరాత్ టైటాన్స్ వద్ద 16 కోట్లు ఉన్నాయి.. వీటితో ఎవరిని కొనుగోలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బెంగళూరు..

బెంగళూరు జట్టు ఖాతాలో ప్రస్తుతం 83 కోట్లు ఉన్నాయి.

ఢిల్లీ

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 73 కోట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఆర్టీఎం కార్డ్స్ ఉపయోగించాలని నిబంధన ఉంది.

లక్నో

లక్నో జట్టు వద్ద ప్రస్తుతం 19 కోట్లు ఉన్నాయి. ఒక ఆర్ టి యం కార్డు మాత్రమే ఉంది. లక్నో జట్టు నుంచి చాలామంది ఆటగాళ్లు బయటికి వెళ్లిపోయారు. అందులో కెప్టెన్ రాహుల్ కూడా ఒకడు.