https://oktelugu.com/

IPL Retention List :  అనుకున్నదే అయింది.. వేలంలోకి వారు వచ్చేసారు.. 10 జట్ల రి టెన్షన్ లిస్ట్ ఎలా ఉందంటే..

అనుకున్నదే అయింది. అందరూ ఊహించిందే జరిగింది. ఎంతగానో ఎదురు చూసిన రి టెన్షన్ జాబితా విడుదల అయింది. గురువారం గడువు కావడంతో అన్ని జట్ల యాజమాన్యాలు బీసీసీఐకి రిటెన్షన్ లిస్ట్ సమర్పించాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 31, 2024 / 10:25 PM IST

    IPL Retention List

    Follow us on

    IPL Retention List :  జాబితాలను ఐపీఎల్ అధికారిక ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా వెల్లడించాయి. పది జట్లకు సంబంధించిన రి టెన్షన్ జాబితాను బహిర్గతం చేశాయి. జట్టు తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను బయటి ప్రపంచానికి తెలియజేశాయి. రి టెన్షన్ జాబితాలో పెద్దగా ఆశ్చర్యం చోటు చేసుకోలేదు. అందరూ ఊహించినట్టుగానే ఆ జాబితా ఉంది.. కథ సీజన్లో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ బయటికి వచ్చేసారు. వారు మెగా వేలంలో పాల్గొంటారు. కోల్ కతా జట్టు అయ్యర్ ను మాత్రమే కాకుండా గత ఏడాది 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కు వీడ్కోలు పలికింది. రి టెన్షన్ విధానంలో హైయెస్ట్ ధరను భారత ఆటగాడు విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. 21 కోట్లకు బెంగళూరు జట్టు అతడిని రిటైన్ చేసుకుంది. కోల్ కతా జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇద్దరి ఆటగాళ్లతోనే పంజాబ్ జట్టు సరిపెట్టుకుంది. ఇక మిగతా జట్లు ఏ ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకున్నాయో.. ఏ ఆటగాళ్ళను బయటికి పంపించాయో.. ఒకసారి పరిశీలిస్తే..

    గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ ను తమతోనే ఉంచుకుంది. ఇందుకు గాను అతడికి 16.5 కోట్లు చెల్లించింది. రషీద్ ఖాన్ కు పద్ధతి కోట్ల చెల్లించింది. సాయి సుదర్శన్ కు 8.5 కోట్లు, రాహుల్ తేవాటియ 4 కోట్లు, షారుక్ ఖాన్ 4 కోట్లు చెల్లించింది.

    లక్నో జట్టు

    లక్నో జట్టు నికోలస్ పూరన్ కు 21 కోట్లు చెల్లించింది, రవి బిష్ణోయ్ కి 11 కోట్లు, మయాంక్ యాదవ్ 11 కోట్లు, మోహ్ సిన్ ఖాన్ నాలుగు కోట్లు, ఆయుష్ బదోని కి నాలుగు కోట్లు చెల్లించింది.

    ముంబై ఇండియన్స్

    బుమ్రా కు 18 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ 16.35 కోట్లు, హార్దిక్ పాండ్యా 16.35 కోట్లు, రోహిత్ శర్మ 16.30 కోట్లు, తిలక్ వర్మ 8 కోట్లు చెల్లించింది.

    చెన్నై సూపర్ కింగ్స్

    మహేంద్ర సింగ్ ధోని 4 కోట్లు, రుతు రాజ్ గైక్వాడ్ 18 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, మతీష పతీరణ 13 కోట్లు, శివం దూబే 12 కోట్లు చెల్లించింది.

    సన్ రైజర్స్ హైదరాబాద్

    హైదరాబాద్ జట్టు క్లాసెన్ కు 23 కోట్లు, కమిన్స్ కు 18 కోట్లు, అభిషేక్ శర్మకు 14 కోట్లు, హెడ్ కు 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి ఆరు కోట్లు చెల్లించింది.

    బెంగళూరు

    విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదర్ 11 కోట్లు, యష్ దయాల్ కు ఐదు కోట్లు చెల్లించింది.

    ఢిల్లీ క్యాపిటల్స్

    అక్షర్ పటేల్ 16.5 కోట్లు, కులదీప్ యాదవ్ 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ పది కోట్లు, అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్ల చెల్లించింది.

    కోల్ కతా నైట్ రైడర్స్

    రింకూ సింగ్ 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి 12 కోట్లు, సునీల్ నరైన్ 12 కోట్లు, అండ్రి రస్సెల్ 12 కోట్లు, హర్షిత్ రాణా నాలుగు కోట్లు, రమణ్ దీప్ సింగ్ కు నాలుగు కోట్లు చెల్లించింది.

    పంజాబ్ కింగ్స్

    శశాంక్ సింగ్ 5.5 కోట్లు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ నాలుగు కోట్లు చెల్లించింది.

    రాజస్థాన్

    రాజస్థాన్ జట్టు సంజు సాంసన్ కు 18 కోట్లు, యశస్వి జైస్వాల్ కు 18 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, ధృవ్ జురెల్ కు 14 కోట్లు, హెట్ మెయిర్ కు 11 కోట్లు, సందీప్ శర్మకు నాలుగు కోట్లు చెల్లించింది.