How Much BCCI Earned From IPL 2025: ఐపీఎల్ అనేది రిచ్ క్రికెట్ లీగ్. ఈ సీజన్లో కన్నడ జట్టు విజేతగా నిలిచింది. ప్రీతి జింటా జట్టును చివరి అంచె పోరులో ఓడించి తొలిసారిగా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ సీజన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో.. ఆదాయం ఎంత వచ్చింది.. బిసిసిఐ ఎంత సంపాదించింది.. అనే విషయాలపై జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం.. లైవ్ టెలికాస్ట్ రైట్స్ సోల్డ్, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ.. టాటా గ్రూప్ నుంచి 2500 కోట్ల ప్రాయోజిత ధనం.. ఇవన్నీ కలిపితే బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా దండిగా ఆదాయం వచ్చింది. బీసీసీఐ మాత్రమే కాదు, అన్ని జట్ల యాజమాన్యాలకు కూడా బీభత్సమైన రెవెన్యూ లభించింది. బీసీసీఐ ఏకంగా 20వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సొంతం చేసుకుంది.. ఐపీఎల్ నిర్వహణ ద్వారా బీసీసీఐకి ప్రకటనలతో విపరీతంగా ఆదాయం వస్తుంది. 2025 ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ను బిసిసిఐ 9,678 కోట్లకు అమ్మింది. అంతేకాదు ఒక మ్యాచ్ ద్వారా వచ్చే రెవెన్యూ కూడా దాదాపు 130.7 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ టెలికాస్ట్ రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ ఓన్ చేసుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రిలయన్స్ ఆధ్వర్యంలోని వయా కం దక్కించుకుంది.
అడ్వర్టైజర్లు పెరిగారు..
ప్రఖ్యాత ఎకనామిక్ టైమ్స్ వెలువరించిన కథనం ప్రకారం ఐపీఎల్లో ఈ సీజన్ కు సంబంధించి అడ్వర్టైజర్లు 27 శాతానికి పెరిగారు. మొత్తంగా వారి సంఖ్య 105 కు చేరింది. ఇక వచ్చే ఐదేళ్లపాటు టైటిల్ ప్రాయోజిత సంస్థగా ఉండడానికి టాటా గ్రూప్ ఒప్పుకుంది. దీనికోసం 2500 కోట్లు చెల్లిస్తున్నట్టు టాటా గ్రూప్ సమ్మతం తెలిపింది. దానికి సంబంధించి సంతకం కూడా చేసింది. వచ్చే ఐదేళ్ల వరకు అంటే ప్రతి సీజన్లో టాటా గ్రూప్ 500 కోట్లు బీసీసీఐకి అందిస్తుంది. టాటా గ్రూప్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీల నుంచి కూడా బీసీసీఐ ప్రాయోజిత ఆదాయాన్ని సొంతం చేసుకుంటుంది..
ప్రతి జట్టు నుంచి బీసీసీఐ టికెట్, స్పాన్సర్షిప్, సెంట్రల్ విభాగాల ద్వారా 20% ఆదాయం, లైసెన్సింగ్ విభాగంలో 12.5% ఆదాయాన్ని పొందుతుంది.. లీగ్ దశలో సాధించిన స్థానం ఆధారంగా ప్రతిగట్టుకు స్థిరమైన కేంద్ర ఆదాయం, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ ఆయా జట్లకు అందిస్తుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ తన ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. దీని ద్వారా 20, 686 కోట్లను సంపాదించింది. ఇక 2023 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ తన ఆదాయాన్ని 16,493 కోట్లకు చేర్చుకుంది. 2024 లో 26 కోట్లను ఆదాయంగా సొంతం చేసుకున్న బీసీసీఐ.. ఒక ఏడాదిలోనే ఆ ఆదాయాన్ని మరింత పెంచుకుంది. కార్పొరేట్ కంపెనీలను కూడా ప్రాయోజిత సంస్థలుగా మార్చుకుంది. తద్వారా ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డులను బీసీసీఐ సృష్టించింది. ఇదే జోరు గనుక బీసీసీఐ కొనసాగిస్తే త్వరలోనే ఫిఫా ను అధిగమిస్తుందని తెలుస్తోంది..
అద్భుతమైన మార్కెటింగ్ నైపుణ్యం.. క్రికెట్ కు విపరీతమైన ఆదరణ దక్కేలా చూడటం.. మ్యాచ్ ల నిర్వహణలో అధునాతన పద్ధతులను పాటించడం.. డబ్బు చెల్లింపులో స్థిరత్వాన్ని పాటించడం వంటి విధానాల ద్వారా బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణలో విజయవంతమవుతోంది. మిగతా క్రికెట్ జట్లు టి20 లీగ్ లు నిర్వహించినప్పటికీ ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోవడానికి పై ఉదంతాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ద్వారానే కాకుండా.. సొంతంగా లీగ్ నిర్వహించుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్నది. ఒకానొక దశలో ఐసీసీ కూడా కుళ్లుకునే విధంగా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నది.