ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.20 లక్షలు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వారికి రూ.12 లక్షలు ప్రైజ్ మనీ గా ఇవ్వనన్నారు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ఆటగాడికి రూ.15 లక్షలు గేమ్ చాలెంజర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.12 లక్షలు దక్కించుకుంటారు.
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరగనుంది. తుది సమరంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టోర్నీ విజేతగా ఎవరు నిలుస్తారనే చర్చ ఒకవైపు సాగుతుండగానే.. విజేతగా నిలిచిన జట్టుకు ఎంత మొత్తంలో చెల్లిస్తారనే దానిపైనా ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టైటిల్ విజేతగా నిలిచే జట్టు ఎంత ప్రైజ్ మనీని గెలుచుకోనుంది..? రన్నరప్ గా నిలిచే జట్టు ఎంత మొత్తం దక్కించుకుంటుంది..? అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ విషయాలను మీకు అందిస్తన్నాం.
ఐపీఎల్ 16వ ఎడిషన్ తుది సమరం ఆదివారం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ టైటిల్ పోరు లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో విజేతగా నిలిచే జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించనుంది. రన్నర్ గా నిలిచే జట్టుకు ఎక్కువ మొత్తమే ముట్టనుంది. అలాగే ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు లక్షల రూపాయలు చేతికి అందనున్నాయి.
విజేతగా నిలిచే జట్టుకు రూ.20 కోట్ల రూపాయలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో విజేతగా నిలిచే జట్టు రూ.20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకోనుంది. రన్నరప్ గా నిలిచే టీమ్ రూ.13 కోట్లు తీసుకుంటుంది. అలాగే, మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఏడు కోట్ల రూపాయలు అందనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు 6.5 కోట్లు ఇవ్వనున్నారు. ఈ ఏడాది భారీ మొత్తంలో ప్రైజ్ మనీని ఐపిఎల్ యాజమాన్యం ఆయా జట్లకు అందిస్తోంది.
ఆటగాళ్లకు భారీ మొత్తంలో నజరానా..
ఇక వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఐపీఎల్ యాజమాన్యం భారీ మొత్తంలో నజరానా అందిస్తోంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో గుజరాత్ ఆటగాడు గిల్ 851 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఆటగాడికి రూ.15 లక్షల క్యాష్ రివార్డు అందించనున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారు. ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ కు కూడా రూ.15 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. ప్రస్తుతం గుజరాత్ పేసర్ మహమ్మద్ షమీ 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లుతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.20 లక్షలు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వారికి రూ.12 లక్షలు ప్రైజ్ మనీ గా ఇవ్వనన్నారు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ఆటగాడికి రూ.15 లక్షలు గేమ్ చాలెంజర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన ప్లేయర్ కు రూ.12 లక్షలు దక్కించుకుంటారు.