Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 16న గురువారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో తుల, సింహా, మిథునం రాశివారికి ధన యోగం ఉంటుంది. మిగతా 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
ఈ రాశివారి మనసులో ఆందోళన ఉంటుంది. కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఆర్థికపరంగానూ ఇబ్బందులు ఉండొచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభం:
బాధ్యతలు నెరవేర్చడంలో ఇంట్రెస్ట్ పెడుతారు. ఉద్యోగులు అదనపు పనులు చేయాల్సి ఉంటుంది. సీనియర్ల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు.
మిథునం:
మిథునం రాశివారికి ఆకస్మిక ధన యోగం ఉంటుంది. స్నేహితుతు, బంధువులను కలవడం వల్ల ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
ఒక ముఖ్యమైన విషయం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు సైతం తమ నైపుణ్యాలతో ఆకట్టుకుంటారు.
సింహం:
సింహారాశి వారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ధన లాభం వచ్చే అవకాశం. అయితే కుటుంబ సభ్యల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కన్య:
ఇప్పటి వరకు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
తుల:
తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ. కటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. తండ్రి సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
కొత్త పెట్టుబడులు పెడుతారు. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని రంగాల వారికి ఆకస్మిక ధన లాభం. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనస్సు:
ఉద్యోగులు సహోద్యోగులతో వాగ్వాదానికి దిగుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. తొందరపడి ఏ పని చేయొద్దు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు.
మకరం:
వ్యాపారం చేయాలనుకునేవారికి అనుకూలం. బంధువులు, స్నేహితులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం:
ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన వార్తలు వినొచ్చు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను చెడగొట్టాలని చూస్తారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మీనం:
బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సాయంత్రం శుభవార్త వింటారు. ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో ఉంటారు.