https://oktelugu.com/

స్కూల్ తెరిచిన రోజే విద్యార్థికి కరోనా పాజిటివ్.. చివరకు..?

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి స్కూల్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు కరోనా సోకకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. అయితే ఎన్ని చర్యలు చేపట్టినా పలు ప్రాంతాల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం. అయితే ఉత్తరాఖాండ్ లో పాఠశాలలు తెరిచిన తొలి రోజే విద్యార్థికి కరోనా నిర్ధారణ అయింది. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్ […]

Written By: , Updated On : November 3, 2020 / 05:55 PM IST
Follow us on

student tests covid 19 positive

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి స్కూల్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు కరోనా సోకకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. అయితే ఎన్ని చర్యలు చేపట్టినా పలు ప్రాంతాల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతూ ఉండటం గమనార్హం. అయితే ఉత్తరాఖాండ్ లో పాఠశాలలు తెరిచిన తొలి రోజే విద్యార్థికి కరోనా నిర్ధారణ అయింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

దీంతో ఆ క్లాస్ లోని 15 మంది విద్యార్థులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో ఈ ఘటన అర్థమయ్యేలా చెబుతోంది. దీంతో పాఠశాల మూసివేసి అధికారులు శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఉత్తరాఖాండ్ లోని డెహ్రాడూన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read: బిహార్‌‌ భవితవ్యం తేల్చనున్న రెండో విడత ఎన్నికలు

పూర్తి వివరాల్లోకి వెళితే స్కూల్ కు హాజరైన 18 సంవత్సరాల విద్యార్థికి తండ్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనకు కరోనా నిర్ధారణ అయిందని ఆ వ్యక్తి చెప్పగా విద్యార్థి సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షల్లో విద్యార్థికి కరోనా సోకినట్టు తేలింది. ఐసోలేషన్ లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కీలక సూచనలు చేశారు.

Also Read: అమెరికాలో రెండు పార్టీలే ఎందుకు ఉంటాయి?

మరోవైపు ఏపీలో నిన్నటి నుంచి పాఠశాలలు ప్రారంభం కాగా ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పాఠశాలలకు, కాలేజీలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గినప్పటికీ అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు.