spot_img
Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer batting performance: ఏమయ్యా గంభీర్.. చూసావా ఇదీ మా అయ్యర్ రేంజ్..

Shreyas Iyer batting performance: ఏమయ్యా గంభీర్.. చూసావా ఇదీ మా అయ్యర్ రేంజ్..

Shreyas Iyer batting performance: మనకు నచ్చని వాడు అందలం ఎక్కుతూ ఉంటే ఎక్కడో కాలుతూ ఉంటుంది. అతడు ఎక్కకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి అనిపిస్తుంది. కాళ్లలో కట్టెలు పెట్టి పైశాచిక ఆనందం పొందాలనిపిస్తుంది. ఇదే విధానాన్ని టీమిండియా కు వచ్చి గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ విషయంలో కొనసాగించాడు.

గౌతమ్ గంభీర్ కోచ్ కాబట్టి.. జట్టులో అతడు ఏం చెప్పినా సరే చెల్లుబాటు అవుతుంది. కానీ రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు కదా.. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే.. తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్నట్టుగా.. అన్ని రోజులు అయ్యర్ మీద పైశాచిక ఆనందాన్ని పొందిన గౌతమ్ గంభీర్.. ఇప్పుడు తలవంచుకున్నాడు. కాదు కాదు కళ్ళ ముందు కనిపిస్తుంటే అన్ని మూసుకున్నాడు.

2024లో షారుక్ ఖాన్ జట్టును విజేతగా నిలపడంలో అయ్యర్ తిరుగులేని పాత్ర పోషించాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లతో కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా వారిలో స్ఫూర్తినింపాడు. తీరా షారుక్ ఖాన్ జట్టు విజేతగా నిలిచిన తర్వాత ఆ ఘనత మొత్తం గౌతమ్ గంభీర్ తీసుకున్నాడు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని టీమిండియా కోచ్ అయ్యాడు.. ట్రోఫీ గెలిచిన తర్వాత షారుక్ ఖాన్ జట్టు యాజమాన్యానికి కళ్ళు నెత్తికి ఎక్కాయి. దీంతో అయ్యర్ జట్టు నుంచి బయటికి వచ్చాడు. పంజాబ్ జట్టుకు సారథిగా మారిపోయాడు. గత సీజన్లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్ లో ఒత్తిడికి గురికాకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా ప్రీతి జింటా జట్టు విజేతగా నిలిచేది.

ఇక ప్రస్తుత సీజన్లో అయ్యర్ పంజాబ్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో అయ్యర్ తన రేంజ్ ఇన్నింగ్స్ అడలేక పోయినప్పటికీ.. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో తన అసలు రూపాన్ని చూపించాడు. మైదానంలో సునామి తరహాలో బ్యాటింగ్ చేశాడు. ప్రారంభంలో నిదానంగా ఆడిన అతడు.. ఆ తర్వాత విధ్వంసం అంటే ఏంటో చెన్నై బౌలర్లకు రుచి చూపించాడు. ఇప్పటికే పంజాబ్ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించింది.. ఫలితంగా టేబుల్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది కూడా పంజాబ్ జట్టు ఇలానే ఆడింది. ఫైనల్ దాకా వెళ్ళింది. ఈసారి కూడా ఫైనల్ వెళ్లడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

అయ్యర్ ఇలా ఆడుతున్నాడు కాబట్టి గౌతమ్ గంభీర్ ఈగో హార్ట్ కావచ్చు.. కానీ కోచ్ ఈగో వల్ల ఒక ఆటగాడి కెరియర్ నాశనం కావొద్దు. అయ్యర్ అభిమానులు ఇదే కోరుకుంటున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అయ్యర్ జాతీయ జట్టులోకి వస్తాడని.. గంభీర్ అన్ని మూసుకునే విధంగా ఆట తీరుతో ఆకట్టుకుంటాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular