Henrich Klaasen Run Out
Henrich Klaasen : హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఈసారి ఎందుకనో హైదరాబాద్ జట్టు (Sun Risers Hyderabad) రాజస్థాన్ జట్టు మీద చూపించినట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మీద ప్రదర్శించలేకపోయింది.. మొత్తంగా 300 స్కోర్ అంచనా వేస్తే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్(47), అనికేత్ వర్మ(36), నితీష్ కుమార్ రెడ్డి (32) టాప్ స్కోరర్ లు గా నిలిచారు. శార్దూల్ ఠాకూర్ (4/34) నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0), అభినవ్ మనోహర్ (2), మహమ్మద్ షమి (1) వికెట్లను శార్దూల్ ఠాకూర్ సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న హైదరాబాద్ జట్టును హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత హెడ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన క్లాసెన్(26) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి నాలుగో వికెట్ కు 34 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ప్రిన్స్ యాదవ్ విడదీశాడు. అయితే ప్రిన్స్ యాదవ్ వికెట్ తీయడం కాదు..రన్ అవుట్ లో ముఖ్యపాత్ర పోషించడం క్లాసెన్ పెవిలియన్ చేరుకున్నాడు. అతడు అవుట్ కావడంతో కావ్య మారన్(Kavya maaran) ఒక్కసారిగా షాక్ కు గురైంది.
Also Read : “300” కల.. అన్ సోల్డ్ బౌలర్ వల్ల కల్ల! లక్నో టార్గెట్ ఎంతంటే?!
ఇంతకీ ఏం జరిగిందంటే
హైదరాబాద్ ఇన్నింగ్స్ 12 ఓవర్ ను ప్రిన్స్ యాదవ్ వేశాడు. ఆ ఓవర్ చివరి బంతిని క్లాసెన్ గట్టిగా కొట్టాడు. దానిని క్యాచ్ పట్టుకోవడానికి ప్రిన్స్ యాదవ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ప్రిన్స్ యాదవ్ చేతికి తగిలింది. అతడికి దెబ్బ కూడా గట్టిగానే తగిలింది. కానీ బంతి అలానే గాల్లోకి లేచి స్టంపు ను పడగొట్టింది. అప్పటికి క్లాసెన్ క్రీజ్ దాటి బయటికి వచ్చాడు. దీంతో క్లా సెన్ రన్ అవుట్ అయ్యాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు కీలకమైన వికెట్ కోల్పోయింది. తర్వాత హైదరాబాద్ జట్టు స్కోరు మందగించింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత కొద్దిసేపటికి నితీష్ కుమార్ రెడ్డి(32) రవి బిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ కావడంతో.. హైదరాబాద్ జట్టు స్కోర్ వేగం మరింత మందగించింది. ఈ దశలో అంకిత్ వర్మ (36) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. క్లాసెన్ అవుట్ అవ్వడంతో గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న కావ్య మారన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉందన్నట్టుగా ఫేస్ పెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి.
Also Read : ఇదయ్యా బ్రాండ్ అంటే.. ఐపీఎల్ విలువ ఎంతో తెలుసునా?
What an epic wicket of Klassen by Prince !! #SRHvLSG pic.twitter.com/8u7wFROmls
— Arsh Nehra (@Arshnehra001) March 27, 2025