Virat Kohli: ఆనంద్ మహీంద్రా.. మన దేశంలో ఉన్న కార్పోరేట్లలో ప్రముఖమైన వ్యక్తి. మహీంద్రా కంపెనీ ద్వారా వాహనాలు, ఇతర వ్యాపారాలు సాగిస్తున్న వ్యక్తి. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. ప్రపంచ దేశాలలో కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ.. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ.. ఆయనలో ఏమాత్రం కూడా గర్వం కనిపించదు. పైగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఊపిరి సలపనంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుకుగా పోస్టులు పెడుతుంటారు. ట్విట్టర్ ఎక్స్ లో యాక్టివ్ గా ఉండే ఆయన చతురత తో కూడిన ట్వీట్లు చేస్తూ ఉంటారు. అందులో నవ్వు తెప్పించేవి ఉంటాయి.. ఆలోచించేవి ఉంటాయి. మన మేధాశక్తిని తట్టి లేపేవి కూడా ఉంటాయి. అందుకే ఆనంద్ మహీంద్రా ను చాలామంది ఇష్టపడుతుంటారు. ఆయన ఏదైనా ట్వీట్ చేస్తే.. వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆనంద్ పెట్టే ట్వీట్లు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి కాబట్టే ఆయనను 10.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
ట్విట్టర్ ఎక్స్ లో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్ మ్యాచ్ లో పట్టిన క్యాచ్ ను ఉద్దేశించి చతురతతో కూడిన వాక్యాన్ని దానికి జత చేశారు.. ఏకంగా భౌతిక శాస్త్ర పితామహుడు సర్ ఐజాక్ న్యూటన్ కు ప్రశ్న సంధించారు.. హలో న్యూటన్.. భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తి గురించే మేం చదువుకున్నాం. దానిని నిరూపించే ప్రయోగాలు మీరు చాలా చేశారు. కానీ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మరొకటి ఉందనే విషయాన్ని మీరు ఎప్పుడూ మాకు చెప్పలేదు.. అభివృద్ధి ఆకర్షణ వ్యతిరేక శక్తి గురించి వివరించే నియమానికి సంబంధించి మీరు మాకు ఏమైనా సహాయం చేయగలరా? అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. వాస్తవానికి ఆనంద్ ట్వీట్ చేసిన విరాట్ కోహ్లీ ఫోటో కూడా అలాగే ఉంది. బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ అమాంతం గాల్లోకి లేచి ఎడమచేత్తో క్యాచ్ పట్టుకున్న ఆ ఫోటో ఇట్టే ఆకట్టుకుంటున్నది.. సాధారణంగా అలాంటి క్యాచ్ పట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి.
మైదానంలో ఫీల్డింగ్ చేసే విషయంలో చిరుత పులి లాగా పరిగెత్తే విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు చాలా విన్యాసాలే చేశాడు. అతడి ఫీల్డింగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆ జాబితాలో ఆనంద్ మహీంద్రా కూడా చేరిపోయారు. బ్యాట్స్మెన్ సిక్సర్ గా వెళ్తుంది అని ఊహించిన బంతిని విరాట్ కోహ్లీ అమాంతం గాల్లోకి లేచి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎడమ చేతిని వెనకవైపులాగి రివ్వున దూసుకు వస్తున్న బంతిని అలా అదిమి పట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఎవరికైనా సరే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయడం కుదరదు. విరాట్ కోహ్లీ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకమైన శక్తి కూడా ఉందని తన ఫీల్డింగ్ ద్వారా నిరూపించాడనే భావన ఆ ఫోటో చూస్తే ఎవరికైనా కలుగుతుంది. ఇదే అర్థం వచ్చేలాగా ఆనంద్ మహీంద్రా ఆ ఫోటోను ట్వీట్ చేస్తూ పైన పేర్కొన్న వాక్యాలను దానికి జత చేశాడు. ఆనంద్ మహీంద్రా ట్విట్ చేయడంతో ట్విట్టర్ ఎక్స్ లో ఆ ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఆనంద్ మహీంద్రా కు పలువురు నెటిజన్లు వినూత్నంగా బదులిచ్చారు. ఆనంద్ మీరు చెప్పింది నిజమే.. విరాట్ కోహ్లీ తన ఫీలింగ్ ద్వారా ఐజాక్ న్యూటన్ కు సరికొత్త సవాల్ విసిరారు. గురుత్వాకర్షణ శక్తిని మాత్రమే కాదు దానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తిని కూడా వివరించాల్సి ఉంటుందని ఒక ప్రశ్నను సంధించారు. అంటూ పలువురు నెటిజన్లు ఆయనకు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్విట్ చేసిన ఫోటో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
Hello, Isaac Newton?
Could you help us define a new law of physics to account for this phenomenon of anti-gravity?? pic.twitter.com/x46zfBvycS— anand mahindra (@anandmahindra) January 18, 2024