Ravi Teja: కెరియర్ మొదట్లో రవితేజ కి డబ్బులు సహాయం చేసిన హీరో ఎవరో తెలుసా..?

రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలావరకు డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉండేవాడట. దాంతో చిన్న చిన్న సినిమాల షూటింగ్ కి వెళ్ళినప్పుడు వచ్చే మనీ తో గడిపేవాడు. ఇక అన్నయ్య సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి రవితేజకు ఫైనాన్సియల్ గా కొంత వరకు సపోర్ట్ చేశారంటూ అప్పట్లో వార్తలు కూడా పుష్కలంగా వచ్చాయి.

Written By: Suresh, Updated On : January 18, 2024 2:50 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: మాస్ మహారాజాగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి వరుసగా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే రవితేజ కూడా ఇండస్ట్రీకి చాలా కష్టపడుతూ వచ్చాడు. మొదట చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆ తర్వాత హీరోగా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని అయితే సొంతం చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలావరకు డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉండేవాడట. దాంతో చిన్న చిన్న సినిమాల షూటింగ్ కి వెళ్ళినప్పుడు వచ్చే మనీ తో గడిపేవాడు. ఇక అన్నయ్య సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి రవితేజకు ఫైనాన్సియల్ గా కొంత వరకు సపోర్ట్ చేశారంటూ అప్పట్లో వార్తలు కూడా పుష్కలంగా వచ్చాయి. అప్పుడప్పుడు చిరంజీవి రవితేజకు డబ్బులు ఇస్తూ ఉండేవాడని చాలా మంది చెబుతూ ఉంటారు. అలాగే చిరంజీవి రవితేజ కి అనే కాదు, శివాజీ లాంటి నటులకు కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశాడు. అయితే రవితేజ కి ఇచ్చిన విషయం ఎక్కడ పబ్లిక్ గా చెప్పనప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే రవితేజ కి చిరంజీవి హెల్ప్ చేసినట్టు గా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు మరోసారి తన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత చిత్రాలు అయిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే హరీష్ శంకర్ తో వచ్చే సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమాతో సక్సెస్ కొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే రవితేజ మార్కెట్ భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే రవితేజ ఈగల్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడానికి రెఢీ అయ్యాడు…