Best CNG Cars: సీఎన్జీ కార్లు కొనే చాలా మంది కస్టమర్లు ఒక విషయంలో బాధపడుతుంటారు. అదేంటంటే మంచి మైలేజ్ వస్తుంది కానీ డిక్కీలో సామాను పెట్టుకోవడానికి స్థలం ఉండట్లేదని. డిక్కీ ఖాళీ లేకపోవడం వల్ల లాంగ్ జర్నీలలో సామాను పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వెనుక సీట్లలో సామాను పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది. కస్టమర్ల ఇబ్బందిని మొదటగా టాటా మోటార్స్ గుర్తించింది. ఆ తర్వాత హ్యుందాయ్ కూడా మార్కెట్‌లోకి అలాంటి సీఎన్జీ కార్లను విడుదల చేయడం మొదలుపెట్టింది. వీటిలో సీఎన్జీ సిలిండర్‌తో పాటు ఫుల్ డిక్కీ స్పేస్ కూడా లభిస్తుంది. ఈ రోజు అలాంటి కొన్ని సీఎన్జీ కార్ల గురించి తెలుసుకుందాం.
Also Read: బంగారం ధర రూ.56 వేలకు పడిపోతుందా? త్వరపడండి
Hyundai Exter CNG
హ్యుందాయ్ ఈ SUVలో CNG సౌకర్యం ఉంది. CNG మాత్రమే కాదు, ఫుల్ బూట్ స్పేస్ కూడా ఇవ్వడం వల్ల కస్టమర్లకు సామాను పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కారు CNG వేరియంట్ ధర రూ.8,64,300 నుండి రూ.9,53,390 వరకు ఉంది. కార్‌దేఖో నివేదిక ప్రకారం..ఈ కారు ఒక కిలో CNGకి 27.1 కిమీ మైలేజ్ ఇస్తుంది.
Tata Tiago CNG
ఫుల్ బూట్ స్పేస్‌తో వచ్చే ఈ CNG కారును కొనాలనుకుంటే.. రూ.5,99,990 (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 8,74, 990 (ఎక్స్-షోరూమ్) వరకు పెట్టుకోవాలి.. కార్‌దేఖో నివేదిక ప్రకారం, ఈ కారు ఒక కిలో CNGకి 26.49 కిమీ నుండి 28.06 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.
Tata Punch CNG
టాటా మోటార్స్ కేవలం ఫుల్ బూట్ స్పేస్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ కారును మాత్రమే కాకుండా, ఈ SUVలో కూడా CNGతో ఫుల్ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఈ కారు CNG మోడల్ ధర రూ.7,29, 990 (ఎక్స్-షోరూమ్) నుండి 10, 16, 900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కార్‌దేఖో ప్రకారం, ఈ కారు ఒక కిలో CNGకి 26.99 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు.
Hyundai Grand i10 Nios CNG
హ్యుందాయ్ కంపెనీ ఈ కారు CNG మోడల్‌లో కూడా ఫుల్ డిక్కీ లభిస్తుంది. ఈ కారు CNG వేరియంట్ ధర రూ.7,83,500 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, CNG వేరియంట్‌లోని టాప్ మోడల్ కోసం రూ.8,38,200 (ఎక్స్-షోరూమ్) పెట్టుకోవాల్సి ఉంటుంది. కార్‌దేఖో ప్రకారం, ఈ కారుతో కస్టమర్లకు ఒక కిలోలో 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుంది.
Also Read: స్కూటర్ కావాలా? బైక్ కావాలా? ఓలా దగ్గర అన్నీ రెడీ! మీ ఇష్టం!