Heinrich Klaasen Retirement : ఇదే నెలలో సఫారీ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడుతుంది. ఇంగ్లీష్ దేశం వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్లో కంగారు జట్టుతో సఫారీ జట్టు తలపడుతుంది. కంగారు జట్టు గత సీజన్లో టెస్ట్ గదను అందుకుంది. రోహిత్ సేనను ఓడించి విజేతగా ఆవిర్భవించింది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ప్రారంభమైన తర్వాత భారత పురుషుల క్రికెట్ జట్టు రెండుసార్లు చివరి అంచె పోటీల వరకు వెళ్ళింది. రెండు పర్యాయాలు కూడా ఓటమిపాలైంది.. ముచ్చటగా మూడోసారి ఫైనల్ వెళుతుంది అనుకుంటే ఆ అదృష్టాన్ని దక్కించుకోకుండానే వెనక్కి వచ్చేసింది. ఇక ఈసారి సఫారీ జట్టు, కంగారు జట్టు ఫైనల్స్ లో తలపడబోతున్నాయి.
Also Read : వన్డేలకు స్టార్ ఆటగాడు గుడ్ బై..
మరి కొద్ది రోజుల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సఫారీ జట్టు నుంచి అనూహ్యంగా సూపర్ క్రికెటర్ వీడ్కోలు ప్రకటించాడు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ గా పేరుపొందిన క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. తన సామాజిక మాధ్యమ వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. క్లాసెన్ కు 33 సంవత్సరాల 307 రోజుల వయసు ఉంది..” ఇన్ని రోజులపాటు సఫారి జట్టుకు రావడం నాకు లభించిన గొప్ప గౌరవం. నాకు మొదటిగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వతంగా దూరం జరగాలని భావించుకున్నాను. నా నిర్ణయాన్ని వెల్లడించాను. ఇకపై కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని” క్లాసెన్ వెల్లడించాడు..
సఫారీ జట్టు తరఫున క్లాసెన్ నాలుగు టెస్టులు ఆడాడు. 104 పరుగులు చేశాడు. 60 వన్డేలలో తలపడి 2141 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో 58 మ్యాచులు ఆడి 1000 రన్స్ చేశాడు.. ఇక ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున క్లాసెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీగ్ దశలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో ఇంటికి వెళ్లిపోయినప్పటికీ.. చివరి మ్యాచ్లో క్లాసెన్ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.. తనకు మాత్రమే సాధ్యమైన బ్యాటింగ్ తో అలరించాడు. క్లాసెన్ కంటే కొద్ది గంటల ముందు ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో సీనియర్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతున్నారు. కొంతమంది ప్లేయర్లు అయితే ఆట మీద మక్కువతో టెస్ట్ లేదా టి20 లలో కొనసాగుతున్నారు. తద్వారా జాతీయ జట్టుకు తమ విలువైన సేవలు అందిస్తున్నారు. ఆ తర్వాత వయసు పెరిగిపోవడం.. శరీరం సహకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఆ తర్వాత క్రికెట్ కు సంబంధం ఉన్న విభాగాలలో కొనసాగుతున్నారు. రిటర్మెంట్ అయినప్పటికీ దండిగానే సంపాదిస్తున్నారు. వివిధ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజక కర్తలుగా వ్యవహరిస్తున్నారు.