Single Movie Worldwide Closing Collections : విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు నిరంతరం అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించాలనే తపనతో పని చేసే హీరో శ్రీవిష్ణు(Sree Vishnu). ఆయన రీసెంట్ గా నటించిన ‘సింగిల్'(#Single Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈమధ్య కాలం లో గీతా ఆర్ట్స్ సంస్థ లో తెరకెక్కిన చిత్రాలకు ఈ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మరొకటి రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రన్ పూర్తి అయ్యింది. ప్రతీ ప్రాంతం లోనూ బయ్యర్స్ కి పెట్టిన ప్రతీ పైసాకు పది రూపాయిల లాభాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ప్రాంతాల వారిగా ఈ చిత్రానికి క్లోజింగ్ లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read : హరి హర వీరమల్లు’ చిత్రం ఈ రికార్డ్స్ ని కొట్టకపోతే పరువు పోయినట్టే..!
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగితే, విడుదల తర్వాత ఏకంగా 11 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. బిజినెస్ టర్మ్స్ లో చూస్తే ఇది డబుల్ బ్లాక్ బస్టర్ ని అనొచ్చు. కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ సినిమా ఆరు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే సీడెడ్ లో కోటి 60 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 6 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకు మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. శ్రీవిష్ణు సినిమాలు అమెజాన్ ప్రైమ్ సంస్థ లో మంచి రెవిన్యూ చేశాయో ఏమో తెలియదు కానీ, ఆయన చిత్రాలన్నీ దాదాపుగా అందులోనే విడుదల అవుతూ ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ సంస్థనే కొనుగోలు చేయడం ఆసక్తికరమైన విషయం. వచ్చే వారం లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.