Hardik Pandya MI captaincy : తాజా ఐపీఎల్ లో చాలా రోజుల తర్వాత ముంబై ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించింది. తద్వారా ఫైనల్ వెళ్లడానికి క్వాలిఫైయర్ -2 ఆడింది. కాకపోతే ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది. ముంబై ఓడిపోయిన నేపథ్యంలో తెరపైకి అనేక చర్చలు వస్తున్నాయి.. అందులో ప్రధానమైనది హార్దిక్ కెప్టెన్సీ.. హార్దిక గత సీజన్లో ముంబై జట్టుకు నాయకుడిగా వచ్చాడు. 2022 సీజన్లో గుజరాత్ జట్టును అతడు ఐపిఎల్ విజేతగా నిలబెట్టాడు. 2023లో రన్నరప్ గా చేశాడు. దీంతో అతడిని 2024 సీజన్ లో నాయకుడిగా ముంబై యాజమాన్యం ఎంపిక చేసింది. అయితే గత సీజన్లో హార్దిక్ జట్టు అంతగా ఆకట్టుకోలేదు. కేవలం గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఈ సీజన్లో మాత్రం ప్రారంభంలో ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఏకంగా క్వాలిఫైయర్ -2 దాకా వచ్చేసింది. అయితే ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ముంబై జట్టు ఓటమి చేయవలసి వచ్చింది.
Also Read : క్లాసెన్ కు ఏమైంది? 33 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?
ఇక ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో రోహిత్ శర్మ ఒక క్యాచ్ నేలపాలు చేసినప్పుడు.. హార్దిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే అతడిని డగ్ అవుట్ కి పంపించాడు. దీనికి సంబంధించి విపరీతమైన చర్చ జరిగింది.. అతడిని కావాలని పక్కన పెడుతున్నారని అభిమానులు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ముంబై జట్టు ఓటమి పాలయ్యింది కాబట్టి ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివాదాలు పరిష్కరించుకుంటేనే ముంబై జట్టు వచ్చే సీజన్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సీజన్ మాత్రం ముంబై జట్టుకు ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. గత సీజన్లో సీనియర్ ప్లేయర్ల నుంచి పాండ్యాకు అంతగా మద్దతు లభించలేదు. ఈసారి మాత్రం సీనియర్ ఆటగాళ్ల కంటే ఫారిన్, జూనియర్ ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శనను పాండ్యా రాబట్టాడు. ఒక రకంగా నాయకుడిగా అతడికి శుభవార్త కలిగించే అంశం ఇది. అయితే జట్టులో ఎన్నో లోపాలు ఉన్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పాండ్యా భవితవ్యాన్ని ఏ విధంగా నిర్ణయిస్తుంది? జట్టులో సమస్యలు ఎలా పరిష్కరిస్తుందనేది.. చూడాల్సి ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అయితే పంజాబ్ జట్టుతో ఎదురైన ఓటమిని మేనేజ్మెంట్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Sunil Gavaskar on Hardik Pandya️
“You have to defend 203 runs in knockout and the first thing you do is to sub out Rohit Sharma who has defended 150 runs in the IPL final 3 times and never lost a match while defending 200 runs”
Hardik Pandya’s ego has ruined the legacy of MI pic.twitter.com/fJG05S7mst
— A// (@AdityaGurjar76) June 1, 2025
Hardik Pandya clueless getting his karma for keeping Rohit Sharma in dug out pic.twitter.com/wnA2MHL7xd
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) June 1, 2025
Mumbai Indians, I repeat again. Even in 10 births, you will never find a Captain like Rohit Sharma again. pic.twitter.com/YpXjdL2jWo
— Selfless⁴⁵ (@SelflessCricket) June 1, 2025
Mumbai Indians wasted the best captain of IPL Rohit Sharma in the dugout. Every self respecting MI fan will want him to play for a new team from next year. pic.twitter.com/qtJN5LixGX
— EngiNerd. (@mainbhiengineer) June 1, 2025