Yashaswi Jaiswal : ఇలా మొదలుపెట్టాడు.. అప్పుడే యశస్వి జైస్వాల్ సాధించేసాడు

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ లో ఉన్న భారత జట్టుకు ఎంపికైన జైస్వాల్ కొద్దిరోజుల కిందట జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అదరగొట్టడం ద్వారా జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. గురువారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేయగా.. ఈ జాబితాలో జైస్వాల్ చోటు సంపాదించాడు.

Written By: BS, Updated On : July 21, 2023 9:26 am
Follow us on

Yashaswi Jaiswal : టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ లో ఉన్న భారత జట్టుకు ఎంపికైన జైస్వాల్ కొద్దిరోజుల కిందట జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అదరగొట్టడం ద్వారా జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. గురువారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేయగా.. ఈ జాబితాలో జైస్వాల్ చోటు సంపాదించాడు. తొలి టెస్ట్ లో 171 పరుగులు చేసిన యశస్వి అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ చేసిన ఆటగాడిగాను రికార్డు నమోదు చేశాడు. వెస్టిండీస్ తో జరిగిన ఈ టెస్ట్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లోకి ప్రవేశించాడు. ఈ టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగులు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ పదో స్థానంలో ఉండగా, రిషబ్ పంత్ 11 వ స్థానంలో, విరాట్ కోహ్లీ 14 వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్లు ఆడనుంది. మొదటి టెస్ట్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభమైంది. ట్రేనిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో రెండో సెషన్ కొనసాగుతున్న సమయానికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 125 పరుగులు చేసింది. ఇందులో యశస్వి జైస్వాల్ 52 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 67 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ అద్భుతమైన ఆట తీరుతో పరుగులు చేస్తున్నారు. దీంతో రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా భారత జట్టు పయనిస్తోంది.