GT Vs DC 2023: బలమైన గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ గెలవడానికి అతడే కారణం..!

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లను గుజరాత్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది ఢిల్లీ జట్టుకు. అనంతరం చేజింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఢిల్లీ బౌలర్లు. పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది.

Written By: BS, Updated On : May 3, 2023 10:00 am

GT Vs DC 2023

Follow us on

GT Vs DC 2023: ఐపీఎల్ లో మరో లో స్కోరింగ్ మ్యాచ్ మంగళవారం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరును కాపాడుకుని విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ జట్టుకు.. అట్టడుగు స్థానంలో ఉన్న డిల్లీ క్యాపిటల్స్ జట్టు షాక్ ఇచ్చినట్లు అయింది.

అహ్మదాబాద్ వేదికగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికరమైన పోరు సాగింది. వరుసగా రెండో రోజులో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 130 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్ మహమ్మద్ షమీ నిప్పులు జరిగే బంతులతో చెలరేగిపోవడంతో వరుసుగా ఢిల్లీ జట్టు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. నామమాత్రపు పరుగులకే ఆ జట్టు పరిమితమైంది.

అంతే అద్భుతంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లు..

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లను గుజరాత్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది ఢిల్లీ జట్టుకు. అనంతరం చేజింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఢిల్లీ బౌలర్లు. పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ జట్టు అనూహ్య విజయం సాధించింది.

బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే విజయం..

మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలర్ల ప్రతిభను కొనియాడాడు. ‘ మా బౌలర్లు అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా బ్యాటర్లు మాత్రం షమీ బౌలింగ్ వల్ల తడబడ్డారు. అయితే అమన్, రిపల్ పటేల్ అధ్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ ను చక్కగా ముగించాం. ఈ మ్యాచ్ నెయిల్ బైటర్ లా సాగింది. వరుస వికెట్లు కోల్పోయాం. దీంతో చాలా టెన్షన్ పడిపోయాం. ఒకరు రనౌట్ కూడా అయ్యారు. ఆ బ్యాటింగ్ లో సమస్య ఎక్కడుందో నాకు తెలియడం లేదు’ అని వార్నర్ పేర్కొన్నాడు. పాజిటివ్ ఇంటెంట్ తో ఆడాలని నిర్ణయించుకున్నామని, కానీ అది అనుకున్నట్టు జరగలేదని వెల్లడించాడు. కానీ, విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు వార్నర్. ‘ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడాలి. పవర్ ప్లే లో సాధ్యమైనన్ని వికెట్లు తెసుకోవాలని ముందే అనుకున్నాం. ఫిట్ గా ఉన్నా కూడా ఖలీల్ చివరి మ్యాచ్ ఆడలేకపోయాడు’ అని గుర్తు చేశాడు డేవిడ్ వార్నర్.

ఇషాంత్ ప్రదర్శనతోనే గొప్ప విజయం..

ఇక ఈ మ్యాచ్లో ఇషాంత్ శర్మ ప్రదర్శన అద్భుతంగా ఉందని డేవిడ్ వార్నర్ కొనియాడాడు. ఇషాంత్ మళ్లీ కుర్రాడిలా పెర్ఫార్మన్స్ ఇవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు వార్నర్. తెవాటియా చెలరేగడం చూసి నాకే టెన్షన్ పెరిగిపోయిందని, తను చేసే పనే అది కదా అని మళ్లీ గుర్తు చేసుకున్నానని వెల్లడించాడు. ‘మా బెస్ట్ డెత్ బౌలర్ ఆన్రిచ్. అందుకే అతనికే బంతి ఇచ్చా. కానీ చివర్లో చాలా క్లారిటీతో బౌలింగ్ చేసిన ఇషాంత్ ఈ విజయం అందించాడు’ అని డేవిడ్ వార్నర్ మెచ్చుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 33 పరుగులు అవసరం కాగా.. క్రీజులో హార్దిక్ పాండ్యా, తెవాటియా ఉన్నారు. 19 వ ఓవర్ బౌలింగ్ చేసిన నొకియా మొదటి మూడు బంతులు అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు పరుగులు మాత్రమే చేశాడు. చివరి మూడు బంతుల్లో మూడు సిక్సలను కొట్టి మ్యాచ్ ను గుజరాత్ వైపు మారిపోయేలా చేశాడు తెవాటియా. చివరి ఓవర్ లో 12 పరుగులు అవసరం కాగా, ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.