TPL
TPL: తెలంగాణలోని యువ క్రికెటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Assosiation) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను మళ్లీ ప్రారంభించబోతున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు(JaganMohan Rao) తెలిపారు. బాగా రాణించే యంగ్ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు టీపీఎల్ పేరుతో ఫ్రాంచైజీ టీ20 లీగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే టోర్నీ ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు రూ.కోటి కేటాయిస్తున్నట్లు తెలిపారు.
హెచ్‌సీఏ కీలక నిర్ణయాలు..
శనివారం(ఫిబ్రవరి 8న) సమావేశమైన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ముగిసిన అనంతరం యంగ్ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. ప్రతీ ఉమ్మడి జిల్లాలో పది ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త క్రికెట్ స్టేడియాలు నిర్మించాలని నిర్ణయించింది. ఆ పనులు పూర్తయ్యే వరకు ఉన్న మైదానాలను లీజుకు తీసుకుని పోటీలు నిర్వహిస్తామని తెలిపింది. బాగా రాణిస్తున్న క్రికెటర్లను సత్కరించి వచ్చే నెల హెచ్‌సీఏ అవార్డులను కూడా ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియాన్ని ఆధునికీకరనించాలని కౌన్సిల్ తీర్మానించింది.
అప్పట్లో టీటీఎల్..
ఇదిలా ఉంటే.. 2018లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి జి.వెంకటస్వామి మెమోరియల్ పేరిట జీటీఎల్ నిర్వహించారు. అప్పట్లో అది బాగా ప్రజాదరణ పొందింది. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ టీటీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. అయితే, అనంతరం వచ్చిన హెచ్‌సీఏ పాలకవర్గం టీపీఎల్‌ను కొనసాగించలేదు. ఏడేళ్ల తర్వాత మళ్లీ దానిని కొనసాగించాలని నిర్ణయించింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hca president jagan mohan rao has said that the telangana premier league is going to be restarted
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com