Homeక్రీడలుక్రికెట్‌Under 14 Cricket Selection: అండర్‌ 14 బాలురను రోడ్డునపడేసిన హెచ్‌సీఏ.. షాకింగ్‌ వీడియో

Under 14 Cricket Selection: అండర్‌ 14 బాలురను రోడ్డునపడేసిన హెచ్‌సీఏ.. షాకింగ్‌ వీడియో

Under 14 Cricket Selection: హెచ్‌సీఏ.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌.. క్రికెట్‌ క్రీడాకారులందరికీ.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రా క్రికెట్‌ క్రీడాకారులు, అభిమానులకు బాగా తెలిసిన సంస్థ. క్రికెట్‌ అభివృద్ధిపై దృష్టిపెట్టాల్సిన సంస్థ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ చేస్తోంది. అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. అవినీతికి కేంద్రంగా మారింది. క్రికెట్‌ ప్రోత్సాహాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తోంది. తాజాగా ఈ సంస్థ మరోమారు వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌ జింఖానా స్టేడియం వద్ద జరుగుతున్న అండర్‌ – 14 క్రికెట్‌ జట్టు ఎంపిక కోసం రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు, వారి కోచ్‌లు, తల్లిదండ్రులతో వచ్చారు. అయితే సమయానికి పోటీలు ప్రారంభం కాకపోవడం, కనీసం వచ్చిన వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో పిల్లలు క్యూలో నిలబడి ఎండలో ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నిర్వహణలో లోపాలు..
పర్యవేక్షణ లేకపోవడంతో హైదరాబాదు క్రికెట్‌ అసోసియేషన్‌ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. దీంతో హెచ్‌సీఏ చేతగాని తనానికి ఇది మరో ఉదాహరణ అని క్రికెట్‌ అభిమానులు, నెటిజనుల మండిపడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించడంలో అసోసియేషన్‌ విఫలమైంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు రోడ్డు పక్కన వాహనాల రణగొణ ధ్వనుల మధ్య ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా పడరాని పాట్లు పడుతున్నారు.

తల్లితండ్రుల ఆందోళన..
సోషల్‌ మీడియాలో వీడియోను చూసి క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రికెట్‌ అభిమానులు, సామాజిక వేత్తలు హెచ్‌సీ బాధ్యతా రహిత ప్రవరత్నపై మండిపడుతున్నారు. చిన్నారుల సంక్షేమాన్ని ప్రాధాన్యం ఇవ్వాలని హామీ ఇవ్వాలని కోరుతున్నారు. సమయోచిత చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్‌సీఏపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version