NTR Prashanth Neel Movie Updates: సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ప్రేక్షకులకు కావాల్సిన ఎలివేషన్స్ ను అందిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ వచ్చింది. ఇక ఈ సినిమాకి సైతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను రాబట్టాలని చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పటివరకు ఇండస్ట్రీ హిట్ అయితే దక్కించుకోలేదు. ఇక ఈ సినిమాతో 2000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ తిరగరాయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సైతం భారీ సక్సెస్ మీద కన్నేసాడు. ఈ సినిమాతో రాజమౌళి రికార్డుని సైతం తను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటివరకు మనం నాణానికి ఒకపక్క మాత్రమే చూశాం. సినిమా సక్సెస్ అయితే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం తప్ప ఒకవేళ సినిమా ఆడకపోతే మాత్రం అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరి కెరియర్లు ప్రమాదం లో పడే అవకాశమైతే ఉంది… అందుకే సినిమా అవుట్ ఫుట్ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కొన్ని సన్నివేశాలు బాగా రాకపోతే రీ షూట్ పెట్టుకున్న పర్లేదు గాని ఫైనల్ గా సినిమా థియేటర్ కి వచ్చే సమయానికి ప్రేక్షకులను అలరించాలి.
లేకపోతే మాత్రం వీళ్ళిద్దరి కెరియర్లు ప్రమాదంలో పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… వీళ్ళిద్దరూ టాప్ పొజిషన్ కి వెళ్లాలన్న లేదంటే పాతాళానికి పడిపోవాలన్న ఈ సినిమానే కీలకంగా మారబోతోంది. ఈ ఒక్క సినిమాతో వాళ్ల కెరియర్లు డిసైడ్ అవ్వబోతున్నాయి అనేది వాస్తవం…