Homeక్రీడలుSurya Kumar Yadav Family: మిస్టర్ 360° సూర్య కుమార్ యాదవ్ ఫ్యామిలీని చూశారా..?

Surya Kumar Yadav Family: మిస్టర్ 360° సూర్య కుమార్ యాదవ్ ఫ్యామిలీని చూశారా..?

Surya Kumar Yadav Family: ఇండియన్ స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తాజా ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ ప్రారంభంలో కొంత ఇబ్బంది పడిన సూర్య కుమార్ యాదవ్ గత కొద్దిరోజుల నుంచి మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో చెలరేగి తనకంటూ ప్రత్యేక జ్ఞాపకంగా ఈ మ్యాచ్ ను మలుచుకున్నాడు.

వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ విజృంభించాడు. 49 బంతుల్లోనే 103 పరుగులు చేసి సత్తా చాటాడు. తనదైన మార్క్ షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్లే ఆప్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో ముంబై జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు సూర్య కుమార్ యాదవ్. జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు 12 మ్యాచ్ లు ఆడగా ఏడు మ్యాచ్ లో విజయం సాధించింది మరో ఐదు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. మొత్తంగా 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది ముంబై జట్టు.

కుటుంబ సభ్యుల సమక్షంలో చెలరేగిన సూర్య..

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 49 బంతులు ఆడిన సూర్య కుమార్ యాదవ్ ఆరు సిక్సులు, 11 ఫోర్లు.. 210.20 స్ట్రైక్ రేటుతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు సూర్య కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు మొత్తం హాజరయ్యారు. సూర్య కుమార్ యాదవ్ భార్య, సోదరి, తండ్రి మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఎంజాయ్ చేశారు. భారీగా పరుగులు చేస్తున్న సూర్య కుమార్ ని చూసి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాము చూస్తున్న మ్యాచ్ లోనే విజృంభించి పట్ల వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సూర్య కుమార్ యాదవ్ సెంచరీ చేయగానే కుటుంబ సభ్యులు మొత్తం కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇది సూర్యకుమార్ కుటుంబం.

సూర్య కుమార్ యాదవ్ తల్లిదండ్రులు అశోక్ కుమార్ యాదవ్, సప్న యాదవ్. తండ్రి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. సోదరి దినాల్ యాదవ్. భార్య దేవిషా శెట్టి. 2016 జూలై 7వ తేదీన సూర్య కుమార్ యాదవ్ కు వివాహం జరిగింది. వీరితోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు హాజరై ఎంజాయ్ చేశారు. సూర్య కుమార్ అద్భుతంగా ఆడిన ప్రతి షాట్ ను వీరు ఎంతో ఎంజాయ్ చేశారు. సూర్య చెంచరీ చేసిన తర్వాత వీరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

RELATED ARTICLES

Most Popular