Harshit Rana : వికెట్లు తీశాడు.. సిక్సర్లు బాదాడు. గంభీర్ శిష్యుడంటే మాటలా మరి..

అనంతపురం వేదికగా జరుగుతున్న దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో శుక్రవారం సంచలనం నమోదయింది. ఇండియా - డీ జట్టు తరఫున ఆడుతున్న హర్షిత్ రాణా అద్భుతం సృష్టించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 13, 2024 5:55 pm

Harshit Rana

Follow us on

Harshit Rana : ఇండియా – సీ జట్టుతో తొలి రౌండ్ మ్యాచ్ లో హర్షిత్ 4 వికెట్లు పడగొట్టాడు. 13 ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు.. 5 ఓవర్లు మెయిడ్ ఇన్ చేశాడు. వేగవంతమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. రెండవ ఇన్నింగ్స్ లో వికెట్లు పడగొట్టినప్పటికీ.. అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో రెండవ రౌండ్ లో అనంతపురం వేదికగా ఇండియా – ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హర్షిత్ రాణా అదరగొడుతున్నాడు. గౌతమ్ గంభీర్ శిష్యుడని నిరూపించుకుంటున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున హర్షిత్ రాణా ఆడాడు. ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ ను ఔట్ చేసి..కోల్ కతా జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి చర్చనీయాంశంగా మారాడు. ఢిల్లీకి చెందిన హర్షిత్ దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. గత ఐపీఎల్ సీజన్లో కోల్ కతా జట్టు తరఫున ఆడాడు. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో రాటు తేలాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు సెలెక్టర్ల దృష్టిలో పడి శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు..

అయితే బండి తో మాత్రమే కాకుండా బ్యాట్ తోనూ సత్తా చూపిస్తానని దులీప్ ట్రోఫీలో హర్షిత్ నిరూపించా. స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ అవుట్ అయినప్పటికీ.. హర్షిత్ నిలబడ్డాడు. ఇండియా – ఏ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. 29 బంతుల్లో 31 రన్స్ చేశాడు. నాలుగు ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. అయితే ఇది గాలివాటం ఇన్నింగ్స్ కాదు. దులీప్ ట్రోఫీలో తొలి రౌండు మ్యాచ్ లోని రెండవ ఇన్నింగ్స్ లోనూ హర్షిత్ అదరగొట్టాడు. సహచర ఆటగాళ్లు మొత్తం అవుట్ అవుతున్నప్పటికీ మొండిగా నిలిచాడు. చివరికి నాట్ అవుట్ గా నిలబడ్డాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న మైదానంపై 30 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, సిక్సర్ గా ఉన్నాయి. వికెట్లు మాత్రమే కాదు దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆల్ రౌండర్ గా రూపాంతరం చెందుతున్నాడు. అతడు గనుక ఇదే జోరు కొనసాగిస్తే.. టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది.

ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా – ఏ జట్టు 290 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మూలాని(89) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఇండియా – డీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. 183 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దేవదత్ ( 92) అద్భుతంగా ఆడాడు.. దేవదత్ తర్వాత హర్షిత్ చేసిన 31 పరుగులే సెకండ్ హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం.