Rakul Preet Singh: హోటల్ కి తీసుకెళ్లి వద్దన్నా ఆ పని చేశాడు.. బ్రేకప్ చెప్పేసా… షాకింగ్ మేటర్ రివ్యూ చేసిన రకుల్ ప్రీత్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఆమె తన బ్రేకప్ లవ్ స్టోరీ బయటపెట్టింది. హోటల్ కి తీసుకెళ్లి ప్రియుడు చేసిన పని నచ్చక అతడిని వదిలేసిందట. ఇంతకీ మేటర్ ఏమిటో చూద్దాం..

Written By: S Reddy, Updated On : September 13, 2024 5:56 pm
Follow us on

Rakul Preet Singh: మోడల్ గా కెరీర్ ఆరంభించిన రకుల్ ప్రీత్ సింగ్ 2009లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కన్నడ గిల్లీ ఆమె డెబ్యూ మూవీ. అనంతరం తెలుగులో 2011లో కెరటం టైటిల్ తో ఒక చిన్న చిత్రం. రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మంచి విజయం అందుకుంది. టాలీవుడ్ లో నిలదొక్కుకున్న రకుల్ ప్రీత్ స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేసింది.

బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎన్టీఆర్ తో జతకట్టిన నాన్నకు ప్రేమతో హిట్ టాక్ తెచ్చుకుంది. సరైనోడు, ధ్రువ చిత్ర విజయాలతో రకుల్ ప్రీత్ భారీ ఫేమ్ రాబట్టింది. ప్రస్తుతం ముంబైకే పరిమితం అవుతుంది. హిందీలో చిత్రాలు చేస్తుంది. 2024 ఫిబ్రవరిలో ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది.

కాగా జాకీ కంటే ముందు రకుల్ ప్రీత్ ఓ వ్యక్తిని ప్రేమించిందట. అతడి చర్యలు నచ్చక గుడ్ బై చెప్పిందట. ప్రియుడితో పాటు హోటల్ కి వెళ్లగా అతడు ఆర్డర్ చేసిన ఫుడ్ రకుల్ ప్రీత్ కి నచ్చలేదట. దాంతో తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయమందట. తాను కోరుకున్న ఫుడ్ ని ఆమె ప్రియుడు తక్కువ చేసి మాట్లాడాడట. మన ఆహార అలవాట్లు, పద్ధతులు నచ్చని వాడితో జీవితం బాగోదని రకుల్ బ్రేకప్ చెప్పిందట.

ఈ మేరకు రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రభాస్ పక్కన ఛాన్స్ మిస్ అయ్యిందట. తెలుగులో రకుల్ ప్రీత్ మొదటి సినిమా ప్రభాస్ తో కావాల్సిందట. నాలుగు రోజులు షూటింగ్ అనంతరం చెప్పాపెట్టకుండా ఆమెను తొలగించారట. తన షెడ్యూల్ పూర్తి కాగానే మరొక మూవీ షూటింగ్ కోసం రకుల్ ఢిల్లీ వెళ్లిందట. తిరిగి వచ్చే లోపు రకుల్ స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకున్నారట.

అది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కాగా రకుల్ స్థానంలో కాజల్ వచ్చిందట. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రోజుల్లో ప్రభాస్ మూవీలో ఛాన్స్ అనగానే ఎగిరి గంతేశాను. నన్ను సినిమా నుండి తొలగించడంతో చాలా బాధపడ్డానని రకుల్ చెప్పుకొచ్చింది. ప్రభాస్ పక్కన రకుల్ సన్నగా ఉంది. రషెస్ చూశాక ఆందోళన చెందిన దిల్ రాజు రకుల్ ని తప్పించాడని సమాచారం.