Aus Vs Ind: టెస్ట్ ఫార్మాట్ ను పక్కన పెడితే.. వన్డే, టి20 లలో టీమిండియాలో కొట్టే దేశం లేదు. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు టీం ఇండియా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2024 నుంచి ఒక్క t20 సిరీస్ కూడా కోల్పోలేదు. టి20, వన్డే ఫార్మాట్ లలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 2024లో టి20 వరల్డ్ కప్, 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా సాధించింది. ఇటువంటి జట్టులో ఆటగాళ్లు అత్యంత సమర్థవంతులై ఉండాలి. అది కూడా ఆస్ట్రేలియాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్లో అద్భుతంగా రాణించే ప్లేయర్లు ఉండాలి. కానీ ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ విస్మరించాడు. ప్రధాన శిక్షకుడి స్థానంలో ఉన్న అతడు తనకు నచ్చిన వ్యక్తికి జట్టులో చోటిచ్చాడు.
ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపికైన టీమిండి ఆటగాళ్లలో హర్షిత్ రాణా పేరు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అతడు వచ్చిన అవకాశాలను ఏమాత్రం వినియోగించుకోలేకపోతున్నాడు. పైగా దారుణంగా విఫలమవుతున్నాడు. గౌతమ్ గంభీర్ కోచ్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు టీమిండి ఆడిన ప్రతి సిరీస్ లోను హర్షిత్ ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడినా, ఆడకపోయినా హర్షిత్ కు గౌతమ్ గంభీర్ జట్టులో చోటు కల్పిస్తూనే ఉన్నాడు. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినా సరే గౌతమ్ గంభీర్ హర్షత్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో జాతీయ మీడియాలో, స్పోర్ట్స్ సర్కిల్స్ లో హర్షిత్ మీద విమర్శలు వస్తున్నాయి.
ఒకవేళ పెర్త్ వన్డేలో హర్షిత్ కు తుది జట్టులో చోటు లభిస్తే విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కు హర్షిత్ అత్యంత దగ్గరైన వ్యక్తి కావడమే దీనికి కారణం. అసలు ఆస్ట్రేలియా సిరీస్ కు అతడిని ఎందుకు ఎంపిక చేసారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు హర్షిత్ ఎంపిక మీద పెదవి విరిచారు. ఒకవేళ ప్లేయింగ్ 11 కు హర్షిత్ ఎంపిక అయితే.. అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. ఒకవేళ విఫలమైతే హర్షిత్ కు మిగతా వన్డేలలో తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉండదు.
ఇటీవల కాలంలో హర్షిత్ కు వచ్చిన అవకాశాలు ఏ ఆటగాడికి రాలేదు. వచ్చిన అవకాశాలను అతడు ఏ మాత్రం వినియోగించుకోలేదు. ఆసియా కప్ లో దారుణంగా పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఇక మిగతా మ్యాచ్లో కూడా అతడు సత్తా చూపించలేకపోయాడు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్ అతడికి అవకాశాలు ఇచ్చుకుంటూ పోయాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అతనికి గౌతమ్ గంభీర్ అవకాశం ఇవ్వడం వివాదానికి తెరలేపింది.. పెర్త్ మైదానం పూర్తిగా బౌన్సీ పిచ్. హర్షిత్ పెర్త్ పిచ్ పై ఆకట్టుకుంటే మాత్రం అతడికి తిరుగు ఉండదు.