AP Fake Liquor Scam: సాధారణంగా తప్పు చేసేవారు హడావిడి చేస్తుంటారు. ఎక్కడ దొరికిపోతామని ఆందోళన చెందుతుంటారు. ఈ ఆందోళనలో వారు చెప్పే మాటలు వింతగా ఉంటాయి. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh) కూడా అంతే. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నకిలీ మద్యం డంపు దొరికింది. ఆ మరుసటి రోజు స్క్రిప్ట్ ప్రకారం ఇబ్రహీంపట్నంలో హడావిడి మొదలుపెట్టారు. ఇదిగో ఇక్కడ కూడా నకిలీ మద్యం డంప్ ఉందంటూ సాక్షి మీడియాను తీసుకెళ్లి బయటపెట్టారు. నేరుగా చంద్రబాబు, లోకేష్ చేయిస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు నోరు తెరిచాడో.. జోగి రమేష్ హడావిడి వెనుక ఇంత కథ ఉందా అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. అప్పటినుంచి రోజుకో చిత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీపావళి తర్వాత జోగి రమేష్ అరెస్టు తప్పదనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటివరకు నకిలీ మద్యం పై హడావిడి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ కావాల్సి వచ్చింది. జోగి రమేష్ తీరుపై సొంత పార్టీ శ్రేణులే ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
* ఫోటోలు వైరల్..
తాజాగా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు( Janardan Rao ), ఆయన సోదరుడు జగన్మోహన్రావుతో చనువుగా ఉంటూ ఓ వేడుకల్లో తీసుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా అద్దేపల్లి జనార్దన్ రావు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జోగి రమేష్ ప్రోత్సాహంతోనే తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు ప్రకటించారు. తమను కేసుల్లో ఇరికించినందుకు బయట పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా అయితే చంద్రబాబు తో పాటు లోకేష్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఈ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అక్కడితో జోగి సంబంధాలు ఆగలేదు. అద్దేపల్లి జనార్దన్ రావు తో జోగి రమేష్ చేసిన వాట్సాప్ చాట్ మెసేజ్లు సైతం బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
* బెడిసి కొట్టిన వ్యూహం..
వాస్తవానికి నకిలీ మద్యం ఘటనను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి రాజకీయ మైలేజ్ పొందాలని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ భారీ వ్యూహం రూపొందించింది. కానీ జోగి రమేష్ పుణ్యమా అని అది విఫలమైంది. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. వాస్తవానికి 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి వ్యూహాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. అయితే అప్పటి పరిణామాలను గుణపాఠంగా మార్చుకుంది తెలుగుదేశం పార్టీ. అందుకే అటువంటి ప్రయత్నాలను ఆదిలోనే గుర్తించి నియంత్రించే పనిలో పడింది. చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం డంప్ బయటపడింది. వెనువెంటనే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ హడావిడి ప్రారంభమైంది. అందుకే నిఘా టీం రంగంలోకి దిగింది. అదే సమయంలో షాడో బృందం సైతం నిశితంగా పరిశీలించే సరికి జోగి రమేష్ పాత్ర బయటపడింది. అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో వైసిపి కక్కలేక.. మింగలేని స్థితిలో ఉంది.